కాంగ్రెస్ విష రాజకీయాలు: గండ్ర

2
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ విష రాజకీయాలకు కాళేశ్వరం వేదిక కాకూడదన్నారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన.. గోదావరి నీళ్లను ఎత్తిపోయడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని, రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం కాంగ్రెస్ ప్రభుత్వానికి రిప్రెజెంటేషన్ ఇచ్చింది అన్నారు.

రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజంగానే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్లయితే.. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు కాకపోతే.. తక్షణమే కాళేశ్వరం పంపులు ఆన్ చేసి నీళ్లిచ్చి రైతులను ఆదుకోవాలి.కరువు రాబోతున్న ఈ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయాలకు వాడుకోకండి అన్నారు.

కన్నెపల్లి పంపులను వెంటనే ప్రారంభించి గోదావరి జలాలను నిల్వ చేయాలి అని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం డిమాండ్ చేసింది. ఎల్-నినో ప్రభావం కారణంగా తెలంగాణలో మాన్సూన్ (రుతుపవనాల) వర్షాలు కురవడం లేదు.కేంద్ర జల సంఘం (CWC) తాజా వివరాల ప్రకారం, జూలై ప్రారంభానికి తెలంగాణ జలాశయాల నిల్వలు సాధారణ స్థాయి కంటే 16–46 శాతం తక్కువగా ఉన్నాయి అన్నారు.

రాష్ట్రంలో నీటి కొరత ఉన్నప్పటికీ, నిరంతరం ప్రవహించే ప్రాణహిత–గోదావరిలో వినియోగయోగ్యమైన వరద ప్రవాహాలు అందుబాటులో ఉన్నాయి.ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లిఫ్ట్‌ల వ్యవస్థను సురక్షితంగా తిరిగి వినియోగించుకోవడం అత్యంత సమంజసం.మేడిగడ్డ జలాశయ కనిష్ఠ డ్రా-డౌన్ స్థాయి (MDDL) +93.500 మీటర్లు కాగా, ప్రస్తుతం గేట్లు తెరిచి ఉన్నందున వరద నీటి మట్టం సుమారు +97.500 మీటర్లుగా ఉంది.ఈ హెడ్ ఆధారంగా కన్నెపల్లి పంప్ హౌస్ రోజుకు సుమారు 3 TMCల వరకు నీటిని లిఫ్ట్ చేసే సామర్థ్యం కలిగి ఉంది.అన్నారం, సుందిల్ల నిల్వ స్థాయిలు: నీరు సాఫీగా వెళ్లడానికి అన్నారం బ్యారేజీని +116.500 మీటర్లు (5.1 TMC), సుందిల్ల బ్యారేజీని +126.500 మీటర్లు (3.78 TMC) MDDL స్థాయిల వద్ద నిల్వ చేయాలి.గతంలో ప్రాణహిత వరద ప్రవాహం 10 లక్షల క్యూసెక్కుల పైస్థాయికి చేరిన రికార్డులు ఉన్నాయి. కాబట్టి సాంకేతిక నియమాలకు లోబడి 8.8 TMCల నీటిని లిఫ్ట్ చేసినా గ్రామాల ముంపు గానీ, ఆస్తి లేదా ప్రాణ నష్టం గానీ జరగదు.ఎల్-నినో సంక్షోభ నేపథ్యంలో పంటలను, రైతులను కాపాడటానికి కన్నెపల్లి, అన్నారం, సుందిల్ల పంపింగ్ స్టేషన్లను వెంటనే ఆపరేషన్‌లోకి తేవాలని TREA కోరుతోంది.రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ లక్ష్య సాధన కోసం తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్ల అసోసియేషన్ (TREA) తమ సేవలను స్వచ్ఛందంగా అందించడానికి సిద్ధంగా ఉంది అని తెలిపింది.

- Advertisement -