ఆ మెడిసిన్స్‌కు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి!

1
- Advertisement -

ఆల్కహాల్ పరిమాణం ఎక్కువగా ఉండే మందులు దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం విక్రయ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ప్రభుత్వ తాజా సవరణల ప్రకారం 12 శాతం కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ కలిగి ఉండి…30 మిల్లీలీటర్ల (ml) కంటే పెద్ద సీసాలలో విక్రయించే అన్ని రకాల నోటి ద్వారా తీసుకునే మందులను ఇకపై ‘షెడ్యూల్ హెచ్1’ పరిధిలోకి చేర్చారు. ఈ షెడ్యూల్ పరిధిలోని మందుల అమ్మకాలు, పంపిణీపై కఠినమైన ఆంక్షలు ఉంటాయి.

ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఈ మందులను ఇంతకుముందులాగా మెడికల్ షాపులకు వెళ్లి నేరుగా కొనుగోలు చేయడం సాధ్యపడదు. వీటిని విక్రయించాలంటే అర్హత కలిగిన డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ (చిట్టీ) ఉండటం తప్పనిసరి. అలాగే ఫార్మసిస్ట్‌లు కూడా ఈ మందుల అమ్మకాలకు సంబంధించిన రికార్డులను ఖచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది.

మార్కెట్లో లభించే కొన్ని రకాల దగ్గు సిరప్‌లు , హెల్త్ టానిక్‌లు మరియు ఇతర ద్రవరూప మందులలో ఆల్కహాల్ శాతం ఎక్కువగా ఉంటోంది. ఎలాంటి తనిఖీలు లేకుండా ఇవి మెడికల్ షాపుల్లో నేరుగా దొరుకుతుండటంతో చాలా మంది వీటిని మత్తు కోసం, ఇతర తప్పుడు అవసరాల కోసం దుర్వినియోగం చేస్తున్నారనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ మందులను షెడ్యూల్ హెచ్1 పరిధిలోకి మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

Also Read:Chiru158:లేటెస్ట్ క్రేజీఅప్‌డేట్

- Advertisement -