ఇండోనేషియాలో మోదీ..ఘనస్వాగతం

1
- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా ఇండోనేషియా చేరుకున్నారు. భారతదేశపు ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ (Act East Policy), ‘మహాసాగర్ విజన్’ (MAHASAGAR Vision)తో పాటు స్వేచ్ఛా, బహిరంగ, మరియు సమగ్ర ఇండో-పసిఫిక్ ప్రాంతంపై భారత్ దృష్టిని మరింత బలోపేతం చేయడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.

విమానాశ్రయంలో ఆయనకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వాగతం పలికారు. ప్రధాన మంత్రి మోదీ విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే అధికారిక స్వాగతంలో భాగంగా ఇండోనేషియా వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు ఆయన విమానానికి రక్షణగా (ఎస్కా‌ర్ట్) నిలిచాయి.

న్యూఢిల్లీ నుండి బయలుదేరడానికి ముందు..మోదీ మాట్లాడుతూ.. ఇండోనేషియా, ఆస్ట్రేలియా, మరియు న్యూజిలాండ్ దేశాలలో సాగే ఈ పర్యటన భారతదేశ ప్రాంతీయ భాగస్వామ్యాన్ని, వ్యూహాత్మక దృక్పథాన్ని మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుందని అన్నారు. స్థిరమైన ఇండో-పసిఫిక్ ప్రాంతం పట్ల భారతదేశానికి ఉన్న నిబద్ధతను స్పష్టం చేశారు.

2018లో తాను మొదటిసారి ఇండోనేషియాను సందర్శించినప్పుడు ఇరుదేశాల మధ్య సంబంధాలు ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెరిగాయని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆ స్థాయి పెంపు తర్వాత జరుగుతున్న మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదేనని ఆయన పేర్కొన్నారు. అలాగే జనవరి 2025లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో భారతదేశానికి విచ్చేసిన తర్వాత ఈ పర్యటన జరుగుతోందని చెప్పారు.

Also Read:7 వేల కోట్లు..9 వారాలకే రోడ్డు క్లోజ్!

- Advertisement -