కాళేశ్వరంకు కేటీఆర్

5
- Advertisement -

కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య వైఖరిపై రేపు (జూలై 5న) కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం. మంథని నియోజకవర్గం, కన్నెపల్లి వద్ద వృథాగా పోతున్న జలాలను బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది.

ఎల్‌ నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం వల్ల గోదావరి బేసిన్‌లో కేవలం 23% మాత్రమే రిజర్వాయర్లు నిండి ఉన్నాయి. ప్రస్తుతం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర గోదావరిలో 15 వేల క్యూసెక్కులు దాటి ప్రవాహం నమోదవుతోంది. రానున్న రోజుల్లో ప్రవాహాలు 60 వేల క్యూసెక్కులకు పైగా పెరిగే అవకాశం ఉంది.

ఇలాంటి తరుణంలో మేడిగడ్డ బరాజ్‌పై ఆధారపడకుండా, కన్నెపల్లి (లక్ష్మీ) పంప్‌హౌజ్ దగ్గర నీటిని మళ్లించి, పంపింగ్‌ చేపట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కన్నెపల్లి పంప్‌హౌజ్ మోటార్లు ఆన్ చేస్తే గోదావరిలో ప్రస్తుతం లభిస్తున్న ప్రవాహాన్ని వాడుకొని వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు నీరు అందించే మార్గం ఉందని పేర్కొంటున్నారు ఇంజనీర్లు.

కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే రేపు కన్నెపల్లి పంప్‌హౌజ్‌ను పరిశీలించనున్నారు కేటీఆర్.

- Advertisement -