వన్డే ట్రై సిరీస్ ఫైనల్లో ప్రతీకారం తీర్చుకున్నాడు వైభవ్ సూర్యవంశీ. లీగ్ మ్యాచ్‌లో వైభవ్‌ని టార్గెట్ చేసిన శ్రీలంక ఆటగాళ్లు వ్యక్తిగత దూషణకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకున్నాడు వైభవ్.
లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ (11 బంతుల్లో) సాధించి రికార్డు సృష్టించాడు వైభవ్. 29 బంతుల్లో 94 పరుగులతో లంక ఆటగాళ్లను ఉచకోత కోశాడు వైభవ్. దీంతో ఇండియా ‘ఏ’ 377 పరుగులు చేయగా శ్రీలంక ‘ఏ’ జట్టు 66 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సూర్యవంశీ 117 పరుగులు చేశాడు. అయితే నాలుగు రోజుల క్రితం శ్రీలంక ‘ఎ’తో జరిగిన ఉత్కంఠభరితమైన లీగ్ మ్యాచ్ ముగిసిన తర్వాత అక్కడి ఆటగాళ్లతో అతనికి జరిగిన చిన్న గొడవ ఈ పర్యటనలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ ఘటనకు గాను మందలింపు, జరిమానా విధించవచ్చనే వార్తల నడుమ.. సూర్యవంశీ ఈసారి తన బ్యాట్‌తోనే ప్రత్యర్థులకు సమాధానం చెప్పాడు.
అతని మెరుపు బ్యాటింగ్ వల్ల ఇండియా ‘ఎ’ భారీ స్కోరుకు పునాది పడింది. ఒక దశలో స్కోరు 400 దాటుతుందనిపించినా, మధ్యలో వికెట్లు పడటంతో ఇన్నింగ్స్ కాస్త తడబడి 377/9 వద్ద ముగిసింది. భారత్ ఈ స్కోరైనా సాధించిందంటే దానికి కారణం అనుకుల్ రాయ్. సూర్యవంశీ లాగే అనుకుల్ రాయ్ కూడా సమస్తీపూర్ అనే పట్టణానికి చెందినవాడే కావడం విశేషం.
Also Read:నీట్ రీ-ఎగ్జామ్ పేపర్ లీక్..ఫేక్!
ఇండియా ‘ఎ’ జట్టు 334 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి, ఇంకా కొన్ని ఓవర్లు మిగిలి ఉండగానే ఆలౌట్ అయ్యే ప్రమాదంలో పడిన తరుణంలో.. అనుకుల్ రాయ్ కేవలం 15 బంతుల్లో 4 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి ఇన్నింగ్స్‌కు గట్టి ముగింపునిచ్చాడు.

