రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ..కేసీఆర్,కేటీఆర్ ను తిట్టడమే రేవంత్ రెడ్డి అజెండా అన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్. రేవంత్ రెడ్డి మూర్ఖుడు…క్యూర్,ప్యూర్,రేర్ పైన అవగాహన రేవంత్ రెడ్డికి లేదు అని మండిపడ్డారు. దీనిపై రేవంత్ రెడ్డి చర్చకు సిద్ధంగా ఉన్నారా…?,2009 నుంచి కాంగ్రెస్ అసమర్థత వలనే మెట్రో రైల్ ఆలస్యం అయింది..చారిత్రక కట్టడాలను కాపాడుతూనే కేసీఆర్ మెట్రో ఫెజ్ 1 ను పూర్తి చేశారు అన్నారు.
మెట్రోను రేవంత్ రెడ్డి మట్టిలో కలిపారు..30 వేల కోట్ల మెట్రో ఆస్తులను 15 వేల కోట్లకు తెచ్చానని సీఎం రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారు..మెట్రో ఆస్తులను తన బినామీలకు కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు..రేవంత్ రెడ్డి ఏమైనా ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా…? 30 వేల కోట్ల ఆస్తి ని 15 వేలకు దక్కించుకోవడానికి ?..రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ వ్యవస్థల్లో దందాలు చేస్తున్నారు అన్నారు.
మెట్రో రైల్ కొనుగోలు వ్యవహారం పెద్ద కుంభకోణం..మెట్రో రైల్ కొనుగోలు వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి..మెట్రోలో 13 వేల కోట్ల అప్పును తెలంగాణ ప్రజలపై రద్దుతున్నారు..మెట్రో రైల్ సి.ఎఫ్.ఓ ను బెదిరించిన చరిత్ర రేవంత్ రెడ్డిది ..హైటెక్ సిటీ టూ శంషాబాద్ మెట్రో రైల్ ను రేవంత్ రెడ్డి ఎందుకు రద్దు చేశారు
..రేవంత్ రెడ్డి వలన పెట్టుబడి దారులు హైదరాబాద్ రావాలంటే భయపడుతున్నారు..రేవంత్ రెడ్డి తనపై కమీషన్ వేసుకోవాలి..మెట్రో ఫెజ్ 2 ను కిషన్ రెడ్డి అడ్డుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు.
ఇప్పటికే 71 సార్లు రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు…బీజేపీ సిఎంలు కలవనన్ని సార్లు రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీని కలిశారు…మోడీ ని ఎపుడైనా మెట్రో పై రేవంత్ నిలదీశారా ?…తన బినామీలకు రేవంత్ మెట్రో ఆస్తులను కట్టబెట్టే కుట్ర చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి .దాని పై విచారణ జరగాలి ..8 మంది కాంగ్రెస్ లోక్ సభ సభ్యులు,4 రాజ్యసభ సభ్యులు ఏం చేస్తున్నారు…పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ రాదు,స్వంత రాష్ట్ర కేంద్ర మంత్రితో ప్రాజెక్టు తీసుకురాలేని స్థితిలో రేవంత్ రెడ్డి అన్నారు…రాష్ట్రంలో కాంగ్రెస్,బీజేపీ ఒక్కటే…మోదీ,అమిత్ షా కు రేవంత్ రెడ్డి సరెండర్ అయ్యారు…కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని హిమంత బిశ్వ శర్మలాగా చూస్తుంది…రేవంత్ రెడ్డికి చేతనైతే మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలి…కేసీఆర్ ఫోటో పెట్టుకుని రోజు రేవంత్ రెడ్డి భజన చేయాలి..మోదీని ప్రసన్నం చేసుకుని ఓటుకు నోటు కేసులో తప్పించికోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు అన్నారు.

