అమెరికా దాడిలో విశాఖ వాసి మృతి

3
- Advertisement -

ఒమన్ తీర ప్రాంతంలో భారతీయ నౌక పై అమెరికా జరిపిన బాంబు దాడిలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మృతుల్లో విశాఖపట్నానికి చెందిన మెరైన్ చీఫ్ ఇంజినీర్ సురేశ్ పట్నాల ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది.

ఈ విషాద వార్తను సురేశ్ పట్నాల కుటుంబ సభ్యులతో పాటు ఢిల్లీలోని ఆంధ్రాభవన్ అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు.మెరైన్ చీఫ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తూ సురేశ్ పట్నాల మరణించడంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. సురేశ్‌కు భార్య, అలాగే 13 ఏళ్లు, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి అకాల మరణం చెందడంతో ఆ పిల్లలు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Also Read:‘రాజా ది రాజా’..యూత్ ఫుల్ మెలోడీ

బాంబు దాడిలో మరణించిన సురేశ్ పట్నాల మృతదేహాన్ని స్వదేశానికి, ముఖ్యంగా విశాఖపట్నానికి తీసుకువచ్చేందుకు ఢిల్లీలోని ఆంధ్రాభవన్ అధికారులు, ఉన్నతాధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -