తెలంగాణలో పోటీ చేస్తాం:పవన్

4
- Advertisement -

తెలంగాణపై నాకున్న ప్రేమ రాజకీయాలకంటే అతీతమన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మీడియాతో మాట్లాడిన పవన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే భయపడలేదన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో తనపై అక్రమకేసులు పెట్టరాని అయినా భయపడలేదన్నారు. ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటానని చెప్పారు. ఈ దేశంలో తెలంగాణ అంతర్బాగం అన్నారు. ఎలా వస్తావో చూస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తున్నారన్నారు. తెలంగాణలో పోటీ చేస్తాం..త్వరలోనే తెలంగాణలో తిరుగుతానని చెప్పారు.

తెలంగాణ ఏర్పడిన 12 ఏళ్లలో ఒక్క తెలంగాణ నాయకుడిని కూడా విమర్శించలేదు.. తెలంగాణలో నన్ను అడుగుపెట్టనివ్వను అని బెదిరిస్తున్నారు.. తెలంగాణ మీ అయ్య జాగీరా? అని ప్రశ్నించారు. మాట్లాడితే ఆంధ్రా ఆంధ్రా అంటున్నారు.. అది నాకు నచ్చడం లేదు …తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఆంధ్ర మీద విద్వేషం లేదు అన్నారు.

తెలంగాణ ఏర్పాటు కావాలి అనుకున్నారు కానీ.. ఆంధ్ర ప్రజల మీద ఎక్కడ విద్వేషం చూపించలేదు … నిజంగా విద్వేషం చూపించి ఉంటే ఆంధ్ర ప్రజలు ఒక్కరు కూడా ఇక్కడ ఉండే వాళ్ళు కాదు .. కోనసీమలో అయితే నా తల తీసేయండి అంటారు ..తెలంగాణలో కంటే ఏపీలోనే నాకు బెదిరింపులు ఎక్కువ‌ అన్నారు. గద్దర్ అన్న వెన్నులో బుల్లెట్లు దిగితే నా దగ్గరకి వచ్చారు… గద్దర్ అన్నకు బండి నేను కొనిచ్చా అని తెలిపారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.

Also Read:తెలంగాణను కాపాడుకుందాం!

- Advertisement -