Harish:తెలంగాణ..త్యాగాల చరిత్ర!

3
- Advertisement -

త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు అన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా ద్వారా స్పందించిన హరీష్ రావు.. అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు అన్నారు.

తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు.. నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు… కేసీఆర్ ఉద్యమ నాయకత్వం, సబ్బండ వర్గాల పోరాటం కలిసి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకుందన్నారు.

సాధించుకున్న రాష్ట్రాన్ని పదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాం. సంక్షేమం, అభివృద్ధి రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిపాం…అమరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటూ, తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని ఆకాంక్షిస్తూ..ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు.

Also Read:తెలంగాణను కాపాడుకుందాం!

- Advertisement -