తెలంగాణను కాపాడుకుందాం!

4
- Advertisement -

అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2 అని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి… 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2 అన్నారు.

తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2…పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2 అన్నారు.

కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసింది.తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంది.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ.. ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదాం.. విద్రోహ శక్తుల నుండి మన తెలంగాణను కాపాడుకుందాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Also Read:ఇకపై వాట్సాప్‌ ద్వారా ట్రాఫిక్ చలానా!

- Advertisement -