భారతీయ ఈక్విటీ మార్కెట్లు గత వారం తీవ్ర అస్థిరతకు లోనైన తర్వాత ఈ వారం ట్రేడింగ్‌లో మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసే పలు అంతర్జాతీయ..దేశీయ పరిణామాలపై ఇన్వెస్టర్లు పలు కీలక అంశాలను వెల్లడించారు. ఈ వారం మార్కెట్లకు అత్యంత కీలకమైన అంశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశం. వడ్డీ రేట్ల విషయంలో కేంద్ర బ్యాంకు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది…ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి రేటు పై ఆర్బీఐ గవర్నర్ చేసే వ్యాఖ్యలు బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, మరియు ఆటోమొబైల్ రంగా షేర్లపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపుపై ఇచ్చే భవిష్యత్తు సంకేతాలు…అక్కడ విడుదలయ్యే ఉపాధి గణాంకాలు గ్లోబల్ మార్కెట్లతో పాటు భారత మార్కెట్లను కూడా ప్రభావితం చేయనున్నాయి. యుఎస్ బాండ్ ఈల్డ్స్ మరియు డాలర్ ఇండెక్స్ కదలికలను ఇన్వెస్టర్లు నిశితంగా గమనిస్తున్నారు.
గ్లోబల్ మార్కెట్లో బ్రెంట్ ముడిచమురు ధరల హెచ్చుతగ్గులు భారత రూపాయి విలువపై మరియు దేశీయ ద్రవ్యోల్బణంపై నేరుగా ప్రభావం చూపుతాయి. మధ్యప్రాచ్య దేశాలలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఒపెక్ (OPEC+) దేశాల చమురు ఉత్పత్తి నిర్ణయాలు ఈ వారం కీలకంగా మారనున్నాయి.
గత కొన్ని వారాలుగా విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుండి నిధులను ఉపసంహరించుకుంటున్నారు. మరోవైపు దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు మార్కెట్లకు అండగా నిలుస్తున్నారు. ఈ వారం విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతారా లేదా అనేది మార్కెట్ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
Also Read:మౌంట్ రష్మోర్పై ట్రంప్..!
దేశంలోకి నైరుతి రుతుపవనాల రాక, వివిధ రాష్ట్రాలలో వర్షపాతం నమోదుకు సంబంధించిన అప్డేట్స్ మార్కెట్లకు, ముఖ్యంగా ఎఫ్ఎమ్సీజీ (FMCG) మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో ముడిపడి ఉన్న రంగాల షేర్లకు ఊతాన్ని ఇవ్వనున్నాయి. సాధారణ వర్షపాతం నమోదైతే అది మార్కెట్లలో సానుకూల సెంటిమెంట్‌ను నింపుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్ ఒడిదొడుకులకు లోనయ్యే అవకాశం ఉన్నందున ఇన్వెస్టర్లు లార్జ్-క్యాప్ (Large-cap) మరియు డిఫెన్సివ్ రంగాలైన ఐటీ, ఫార్మా షేర్లపై దృష్టి పెట్టడం మంచిదని ట్రేడ్ నిపుణులు సూచిస్తున్నారు.

