శరీర బరువు తగ్గడం అనేది క్రమశిక్షణ, నిరంతర శ్రమ మరియు జీవనశైలిలో మార్పులతో కూడిన ఒక సుదీర్ఘమైన ప్రయాణం. మన శరీరంలో అన్ని భాగాల కంటే పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వు (Belly Fat) అత్యంత మొండిదైనది. ఇది కరగడానికి చాలా సమయం పడుతుంది. అయితే దీనిని శాస్త్రీయంగా ఎలా కరిగించవచ్చో నిపుణులు ఈజీ సలహాలు ఇచ్చారు.
()మీ ఆహారంలో 70% మార్పులు (డైట్)
మనం బరువు తగ్గడంలో 70 శాతం పాత్ర మనం రోజూ తినే ఆహారానిదే ఉంటుంది. అందువల్ల మీ భోజనంలో సమతుల్యత చాలా అవసరం. మీ రోజువారీ ఆహారంలో పీచుపదార్థం (Fiber), ప్రోటీన్ మరియు ఇతర పోషకాలు ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్‌కు బదులుగా కొబ్బరి నీళ్లు, కివీ వంటి పండ్లు, వివిధ రకాల గింజలు (Seeds), నట్స్ వంటి వాటిని స్నాక్స్‌గా తీసుకోవాలి.
ప్రతి పూట తినే భోజనంలో 30 నుండి 40 గ్రాముల ప్రోటీన్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఇంట్లో వండిన స్వచ్ఛమైన భోజనం, లీన్ ప్రోటీన్, పండ్లు మరియు ఆకుకూరలకు ప్రాధాన్యత ఇవ్వండి.వీటికి దూరంగా ఉండండి: హోటల్ తిండ్లు, ప్యాక్ చేసిన అల్ట్రా-ప్రాసెస్డ్ స్నాక్స్ మరియు క్యాలరీలు ఎక్కువగా ఉండే కూల్ డ్రింక్స్, జ్యూస్‌లను పూర్తిగా పక్కన పెట్టేయాలి.
()బరువు తగ్గడానికి ప్రపంచంలోనే అత్యంత సులువైన మార్గం ‘నడక’. క్యాలరీలను వేగంగా బర్న్ చేయడానికి ప్రతిరోజూ 10,000 నుండి 12,000 అడుగులు (Steps) నడవాలి. అలాగే ప్రతి భోజనం తర్వాత 10-15 నిమిషాల పాటు నడవండి. ఉదయం పూట కాసేపు వాకింగ్ చేయండి లేదా జిమ్‌లో ఇన్‌క్లైన్ ట్రెడ్మిల్ ఉపయోగించండి. మీ వాహనాలను ఆఫీస్ లేదా ఇంటికి కొంచెం దూరంగా పార్క్ చేయడం ద్వారా నడిచే దూరాన్ని పెంచుకోండి. లిఫ్ట్‌లకు బదులుగా మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోండి. కష్టతరమైన కార్డియో వ్యాయామాలు చేయడం కంటే రోజంతా శరీరాన్ని కదలికల్లో ఉంచడం చాలా ముఖ్యం.
Also Read:‘ఇట్లు అర్జున’..ఫస్ట్ సింగిల్
() శరీరం ప్రతిరోజూ క్యాలరీలను ఖర్చు చేయాలంటే వర్కౌట్ చేయడం తప్పనిసరి. మీరు యోగా, వెయిట్ ట్రైనింగ్ (బరువులు ఎత్తడం), స్విమ్మింగ్ (ఈత కొట్టడం) లేదా మీకు నచ్చిన ఏదైనా వ్యాయామాన్ని ఎంచుకోవచ్చు. ఇది మీ శరీరాన్ని క్యాలరీ డెఫిసిట్ (తీసుకునే క్యాలరీల కంటే ఖర్చయ్యే క్యాలరీలు ఎక్కువగా ఉండటం) మోడ్‌లోకి తీసుకెళ్లి, పొట్ట కొవ్వును వేగంగా కరిగిస్తుంది.

