తెలంగాణ భవన్ లో రాష్ట్రపతి ఎన్నిక మాక్ పోలింగ్

198
KCR at t bhavan
- Advertisement -

సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశమైంది. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేంలో ఎంపీలు, ఎమ్మేల్యేలు పాల్గోన్నారు. ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు టీఆర్‌ఎస్ ఇప్పటికే మద్దతు ప్రకటించిన నేపథ్యంలో.. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ విధానంపై అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్ నిర్వహించారు.ఆయనకు మద్దతుగా వేసే పార్టీ ఎమ్మెల్యేల ఓట్లలో ఒక్కటి కూడా వృథా కాకుండా చూసేందుకు, ఆ మేరకు వారికి అవగాహన కల్పించడానికి మాక్ పోలింగ్ ఏర్పాటు చేశారు.

KCR at t bhavan

మాక్ పోలింగ్ అనంతరం.. ఎమ్మెల్యేలకు విద్యార్థివిభాగం రాష్ట్ర కమిటీ సభ్యులను సీఎం కేసీఆర్ పరిచయం చేశారు. విద్యార్థి విభాగం నాయకులకు నియోజకవర్గస్థాయిలో సహాయ సహకారాలు అందించాలని శాసనసభ్యులకు కేసీఆర్ సూచించారు. టీఆర్‌ఎస్వీ రాష్ట్ర కార్యవర్గానికి దిశానిర్దేశం చేశారు. టీఆర్‌ఎస్వీ సభ్యత్వనమోదు, నియోజకవర్గాల కమిటీలు, కాలేజీ, యూనివర్సిటీల కమిటీల ఏర్పాటులో స్థానిక ఎమ్మెల్యేలు సహకరించాలని సీఎం చెప్పారు.

రాబోయే రోజుల్లో ప్రతికాలేజీ, విద్యాసంస్థలో సభ్యత్వ నమోదు, కమిటీలను ఏర్పాటు చేయాలని ఉద్బోధించారు. దీనికోసం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరూ వారికి సహకరించాలని సూచించారు. విద్యార్థి విభాగమే రాబోయే తరానికి కీలకంగా ఉంటుందన్నారు. స్థానికంగా పార్టీ బలోపేతానికి కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యల పట్ల స్పందించేగుణం రావడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో కూడా అవగాహన పెరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థి సంఘం నాయకులకు ప్రజాప్రతినిధులుగా, వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లుగా అవకాశం కల్పించినట్లు సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. విద్యార్థి సంఘంలో కొనసాగే వారికి ఇలాంటి అవకాశాలు వస్తాయన్నారు. టీఆర్‌ఎస్వీలో చురుగ్గా పనిచేసిన బాల్క సుమన్‌కు ఎంపీగా, గ్యాదరి కిశోర్‌కు ఎమ్మెల్యేగా, పిడమర్తి రవి, చిరుమళ్ల రాకేశ్, వాసుదేవరెడ్డి వంటివారికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశాలు కల్పించామన్నారు.

 రాష్ట్ర మంత్రి కే తారక రామారావు, శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్వీ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తారని కేసీఆర్ ప్రకటించారు. విద్యార్థి విభాగం కార్యక్రమాలన్నింటిని వీరు ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తారన్నారు.

- Advertisement -