TTD:శ్రీవారి టికెట్లలో అవకతవకలు

5
- Advertisement -

తిరుమల శ్రీవారి టికెట్లలో బయటపడిన అవకతవకలు బయటపడ్డాయి. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ ద్వారా అధికారిక వెబ్‌సైట్ హైజాక్ చేశారు. శ్రీవాణి ట్రస్టుకు విరాళం ఇచ్చే భక్తుల కోసం ప్రతిరోజు ఆన్‌లైన్‌లో జారీ చేసే 800 టికెట్లను “ఆటో ఫిల్లింగ్” లాంటి థర్డ్ పార్టీ సాఫ్ట్‌వేర్లను వాడి, సాధారణ భక్తులకంటే ముందే టికెట్లు బుక్ చేస్తున్నారు ప్రైవేట్ నెట్ సెంటర్లు, ట్రావెల్ ఏజెంట్లు.

ముందుగానే సాఫ్ట్‌వేర్లో భక్తుల వివరాలు నమోదు చేసి, టికెట్లు పెట్టి సర్వర్ ఎనేబుల్ చేయగానే అధికారిక వెబ్‌సైట్లోకి వివరాలు పంపి క్షణాల్లో 400 నుండి 500 టికెట్లు బుక్ చేస్తున్నారు అక్రమార్కులు.

Also Read:హోల్డర్‌ రాకతో మారిన గుజరాత్!

రూ. 10,500కు లభించే ఈ టికెట్లను రూ. 13,500కు అక్రమంగా విక్రయిస్తూ అక్రమార్కుల దోపిడీకి పాల్పడుతున్నారు. చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్స్ అనే సంస్థ శ్రీవాణి టికెట్లు అక్రమంగా విక్రయిస్తుందని వచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు విజిలెన్స్ అధికారులు.

- Advertisement -