బీఆర్‌ఎస్ మలేషియా ఆధ్వర్యంలో జూన్ 6, 2026న కౌలాలంపూర్‌లోని మాట్రేడ్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ మలేషియా ప్రతినిధులు మారుతి కుర్మా, చిట్టిబాబు, శ్రీధర్, ప్రియా తదితరులు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారిని కలిసి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు.
ఈ ఆహ్వానాన్ని కేటీఆర్ స్వీకరించి, జూన్ 6న మలేషియాలో జరిగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హాజరవుతున్నట్లు ధృవీకరించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎల్. రమణ , మాజీ ఎమ్మెల్యే జి. కిషోర్ పాల్గొన్నారు.
Also Read:రక్తం గడ్డకట్టడం..ప్రమాదకర సంకేతాలు!
తెలంగాణ మరియు తెలుగు ప్రజలను ఒక వేదికపైకి తీసుకువచ్చి, ఈ చారిత్రాత్మక వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు బీఆర్‌ఎస్ మలేషియా విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

