చిన్నికృష్ణుడికి ప్రభాస్‌కి ఏంటీ లింక్‌..?

532
prabhas childhood photo viral
prabhas childhood photo viral
- Advertisement -

బాహుబలి సినిమా ప్రభాస్‌ను దేశవ్యాప్తంగా పరిచయం చేసింది. ముఖ్యంగా బాలీవుడ్‌ జనాలకు మన ప్రభాస్‌ తెగ నచ్చేశాడు. అక్కడి స్టార్‌ హీరోలతో సమానంగా పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రభాస్‌. అందుకే ప్రభాస్‌ గురించి పాయింట్‌ టు పాయింట్‌ కథనాలు వండి వడ్డిస్తోంది బాలీవుడ్‌ మీడియా. ఇటీవల ప్రముఖ మ్యాగజైన్ జిక్యూ అన్ని రంగాల నుండి అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాను ప్రకటించగా.. అందులో దక్షిణాది నుండి ప్రభాస్ ఒక్కడే చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే..

తాజాగా ప్ర‌భాస్ కి చైల్డ్ హుడ్ ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ బుడ‌త‌డేనా ఇప్పుడు ఆర‌డుగుల బుల్లెట్ గా మారిందంటూ అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు. అంతేకాదు ప్ర‌భాస్ ఫోటోని నెట్ లోను ఫుల్ గా షేర్ చేస్తుండ‌డంతో ప్ర‌భాస్ ఫోటో ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియా దృష్టిలో పడింది. నోట్లో వేలు పెట్టుకొని చిన్నికృష్ణుడిలా ఉన్న ఈ చిన్నారి ఎంతో అందంగా ఉన్నాడంటూ వారు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం సాహో అనే చిత్రం చేస్తున్న ప్ర‌భాస్ ఈ సినిమా కోసం మేకోవ‌ర్ పూర్తిగా మార్చుకోనున్న‌ట్టు స‌మాచారం. తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌లో ఈ సినిమాని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -