రంగురంగుల చిత్రసీమ వెనుక ఉండే చీకటికోణం బయటపడడంతో తెర మీద అభిమానుల నీరాజనాలు అందుకునే హీరోలు, దర్శకులు, నిజజీవితాల్లో మాత్రం విలన్లుగా మారిపోయారు. ప్రస్తుతం టాలీవుడ్‌ని షేక్‌చేస్తున్న డ్రగ్స్ అంశం ప్రముఖుల పేర్లు బయటికి రావడం సంచలనంగా మారింది. ఇక డ్రగ్స్ కు బానిసై డీలర్లకు, చిత్ర పరిశ్రమకు మధ్య వారధిగా పని చేశారని సిట్ పోలీసులు సాక్ష్యాలు సేకరించిన నేపథ్యంలో, ఓ ప్రముఖ హీరో, దర్శకుడు, హీరోయిన్ ల అరెస్ట్ తప్పదని సిట్ వర్గాలు చెబుతున్నాయి.
వీరు ఎంతో మందికి తమ చేతుల మీదుగా డ్రగ్స్ సరఫరా చేశారని , మిగతా వారంతా కేవలం కస్టమర్లుగా మాత్రమే ఉన్నారని సిట్ వర్గాలు గుర్తించాయి. కస్టమర్లుగా ఉన్న వారిని ప్రశ్నించి, వారికి కౌన్సెలింగ్ ఇప్పించి, ఈ దందాకు, మత్తుమందుల వాడకానికి దూరం చేసే ప్రయత్నాలు చేస్తామని చెబుతున్న అధికార వర్గాలు, ఈ ముగ్గురినీ మాత్రం అరెస్ట్ చేయక తప్పదని అంటున్నాయి. రెండు మూడు రోజుల్లో వీరి ప్రమేయంపై మరిన్ని ఆధారాలు లభిస్తాయని, ఆపైనే వీరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇక ఓ పబ్బులో వాటా ఉండి, డీలర్లకు, కస్టమర్లకు వారధిగా ఉన్నాడని భావిస్తున్న మరో మాజీ హీరో చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తోంది. సదరు హీరో గతంలోనూ పోలీసు కేసులు ఎదుర్కొన్నాడని సమాచారం.
అయితే ఒక ప్రముఖ దర్శకుడు, అతని శిష్యురాలు మాత్రమే సరాసరి తనను సంప్రదించేవారని కెల్విన్ చెప్పాడు. మిగిలినవారు తమ డ్రైవర్లు, సహాయకుల ద్వారా సంప్రదించేవారని చెప్పినట్లు తెలుస్తోంది. ఎక్కువగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లోని పబ్బులు, బార్లలోనే కలుసుకునేవారు. ఒక్కోసారి ఎంత అడిగితే అంత ఇచ్చేవారని కెల్విన్ చెప్పినట్లు తెలుస్తోంది. కాగా, డ్రగ్స్ కేసులో మంచు మోహన్ బాబు తనయుడు మనోజ్, దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్, అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ కూడా ఉన్నారని వారికి కూడా నోటీసులు వచ్చాయని వారి పేర్లు ఎందుకు బయటపెట్టడం లేదని దర్శకుడు పూరి ప్రశ్నించాడని సమాచారం. ఇక నగరంలోని అన్ని ఈవెంట్ మేనేజ్ మెంట్లు, వాటి మేనేజర్లు, కీలక ఉద్యోగులను కూడా ఓ సారి విచారించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.