సచిన్ టెండూల్కర్.. పరిచయం అక్కర్లేని వ్యక్తి ఈయన. కేవలం క్రికెట్ అభిమానులే కాదు, సచిన్ అంటే తెలియనివారు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. తనదైన ఆటతీరుతో టీమిండియాకు అద్భుతమైన విజయాలను అందించిన లిటిల్ మాస్టర్ క్రికెట్‌లో ఎంతో మందికి సచిన్ టెండూల్కర్ ప్రేరణగా నిలిచాడు. క్రికెట్‌లో ఎన్ని రికార్డులు అయితే ఉన్నాయో అన్ని రికార్డులను సచిన్ తన పేరిట లిఖించాడు. కానీ అలాంటి సచిన్…టెన్నిస్‌కు వీరాభిమానట. ఈ విషయాన్ని స్వయంగా సచినే వెల్లడించాడు.
ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీ పోటీలు తుది దశకు చేరుకున్నాయి. ఆదివారం జరగబోయే పురుషుల సింగిల్స్ ఫైనల్ పోరులో స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌తో క్రొయేషియా ఆటగాడు మారిన్ సిలిచ్ తలపడనున్నాడు. ఫెదరర్‌కి ఇది 11వ వింబుల్డన్ ఫైనల్ కావడం విశేషం. శనివారం పురుషుల సింగిల్స్ సెమీస్‌లో ఫెదరర్ థామస్ బెర్డిచ్(చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించి ఫైనల్‌కి దూసుకెళ్లాడు.
శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో సచిన్ తన భార్యతో కలిసి స్వయంగా మ్యాచ్‌ని వీక్షించాడు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. ‘నేను టెన్నిస్ ఆటకి వీరాభిమానిని. రోజర్ ఫెదరర్‌కి మద్దతు తెలిపేందుకు వచ్చాను. గత పదేళ్లుగా అతని ఆటని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాను’ అని సచిన్ తెలిపాడు. ఇదిఇలా ఉండగా శనివారం సాయంత్రం మహిళల సింగిల్స్ ఫైనల్ పోటీలు జరగనున్నాయి. వీనస్ విలియమ్స్(అమెరికా)- ముగురుజ(స్పెయిన్) మధ్య ఫైనల్ పోరు జరగనుంది.
"I've been watching Roger for the last 10 years. Here I am to support Roger."@sachin_rt is back at #Wimbledon. pic.twitter.com/NBWm7pugfG
— Wimbledon (@Wimbledon) July 14, 2017