ఆర్టీసీ సమ్మె..మెట్రో ఫ్రీక్వెన్సీ పెంపు

4
- Advertisement -

ఆర్టీసీ సమ్మె కారణంగా హైదరాబాద్ పౌరులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు, సమ్మె కాలంలో రద్దీ సమయాలతో పాటు సాధారణ సమయాల్లో కూడా HMRL 56 రైళ్లను నడుపుతుంది.

సాధారణ వారపు రోజులలో ఉదయం , సాయంత్రం రద్దీ సమయాలలో (ఉదయం 8 నుండి 10:30 వరకు మరియు సాయంత్రం 5:00 నుండి 8:00 వరకు) వరుసగా వచ్చే రెండు రైళ్ల మధ్య 3 నిమిషాల 40 సెకన్ల విరామంతో 56 రైళ్లను నడుపుతారు.

రద్దీ లేని సమయాలలో, మియాపూర్-ఎల్.బి. నగర్ (C1) మార్గంలో 4 నిమిషాల 50 సెకన్ల విరామం మరియు నాగోల్ రైదుర్గ్ (C3) మార్గంలో 5 నిమిషాల 20 సెకన్ల విరామం పాటిస్తూ, 44 రైళ్లను వినియోగించి రైళ్ల సంఖ్యను తగ్గిస్తారు.

ఆర్టీసీ సమ్మె దృష్ట్యా, మియాపూర్ – ఎల్.బి. నగర్ కారిడార్‌లో 4 నిమిషాల 20 సెకన్ల విరామంతో, మరియు నాగోల్ – రైదుర్గ్ కారిడార్‌లో 3 నిమిషాల 40 సెకన్ల విరామంతో రోజంతా గరిష్టంగా 56 రైళ్లను నడపాలని నిర్ణయించారు.

Also Read:పిల్లలకు మాటలు ఆలస్యమవ్వడం ఆటిజమా?

అంతేకాకుండా, ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు, హెచ్‌ఎంఆర్‌ఎల్ అభ్యర్థన మేరకు చివరి మెట్రో రైలు సర్వీసును రాత్రి 11.00 గంటల తర్వాత కూడా పొడిగించే అవకాశాన్ని ఎల్‌టిఎంఆర్‌హెచ్‌ఎల్ పరిశీలిస్తోంది.

- Advertisement -