సినిమా వారు మాత్రమే డ్రగ్సు తీసుకుంటున్నారా?

213
Jeevitha Fires on Media on Defaming TFI in Drugs
- Advertisement -

టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం అలజడి సృష్టిస్తోంది. హైదరాబాద్‌ మహా నగరంతో పాటు యావత్తు తెలుగు నేలలో తీవ్ర కలకలంగా మారిన మాదకద్రవ్యాల వ్యవహారంపై ఇప్పుడు పెద్ద సస్పెన్సే నడుస్తోంది. కెల్విన్ అనే ఓ డ్రగ్స్ వ్యాపారితో పాటు అతడి ఇద్దరు అనుచరులను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు అరెస్ట్ చేసిన వారి సెల్ ఫోన్లలోని డేటా ఆధారంగా కూపీ లాగుతున్న పోలీసులు డ్రగ్స్ వాడుతున్న వారు వందల్లోనే కాకుండా వేలు లక్షల్లో కూడా ఉన్నారంటూ మీడియాకు లీకులు ఇచ్చేసి… పెద్ద దుమారమే రేపారు. ఇప్పుడు ఎక్కడ విన్నా డ్రగ్స్ వ్యవహారంపైనే చర్చ నడుస్తోంది. ఈ వ్య‌వ‌హారంపై ఇతర టాలీవుడ్ ప్రముఖులు కూడా స్పందిస్తూ త‌మ అభిప్రాయం చెబుతున్నారు. కొంద‌రు చేసిన ప‌నికి సినీ ప‌రిశ్ర‌మ మొత్తాన్ని నిందించ‌వ‌ద్ద‌ని కోరుతున్నారు.

Jeevitha Fires on Media on Defaming TFI in Drugs

డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై సినీ న‌టి, నిర్మాత జీవిత స్పందించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ… సినిమా వారు చిన్న త‌ప్పు చేసినా కూడా అది మీడియాలో బ్రేకింగ్ న్యూస్ గా చూపిస్తార‌ని అన్నారు. మీడియా త‌మ‌కు ఎంత‌గా ఉప‌యోగ‌ప‌డుతుందో, అంతే ఇబ్బందిక‌రంగా కూడా త‌యార‌వుతోందని వ్యాఖ్యానించారు. సినిమా వారు ఒక్కరే డ్రగ్సు తీసుకుంటున్నారా? అని జీవిత ప్ర‌శ్నించారు. ఎంతో మంది రాజకీయ నాయ‌కుల, వ్యాపారుల పిల్ల‌లు, ఆఖ‌రికి రిక్షా కార్మికుల పిల్ల‌లు కూడా తీసుకుంటున్నారు క‌దా? అని ఆమె అన్నారు.

Jeevitha Fires on Media on Defaming TFI in Drugs

అస‌లు మారిపోయిన సంస్కృతి ప్ర‌భావ‌మే ఈ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారానికి ప్ర‌ధాన‌ కార‌ణ‌మ‌ని జీవిత అన్నారు. అప్ప‌ట్లో ప‌బ్బులు లేవని, ఇటువంటి క‌ల్చ‌ర్ లేదని ఆమె అన్నారు. ఈ క‌ల్చ‌ర్ వ‌చ్చిన ప్ర‌భావంతోనే ప‌బ్బులలో విచ్చ‌ల‌విడిగా డ్ర‌గ్స్ దొరుకుతున్నాయని తెలిపారు. ఇప్పుడు ఆలోచించాల్సింది దీనిపై ఎటువంటి అవ‌గాహ‌న తీసుకురావాలనే విష‌యాన్ని అని ఆమె అన్నారు. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై స‌మాజం మొత్తం అప్ర‌మ‌త్తం కావాలని చెప్పారు. ముఖ్యంగా ఆలోచించాల్సింది పాఠ‌శాల‌ల్లోని విద్యార్థులు కూడా ఈ వ్య‌స‌నం బారిన ఎలా ప‌డుతున్నారనే విష‌యంపై అని హిత‌వు ప‌లికారు. స్కూళ్ల‌లోకి డ్ర‌గ్సు ఎలా వెళుతున్నాయి? అనే విష‌యాన్ని గుర్తించాలని చెప్పారు. పిల్ల‌లు డ్ర‌గ్స్ బారిన ప‌డ‌కుండా చూడాలని అన్నారు.

- Advertisement -