తిమ్మరాజుపల్లి టీవీ’..అందుకే ప్రీమియర్‌!

8
- Advertisement -

‘తిమ్మరాజుపల్లి టీవీ’ ప్రీమియర్ షోలు ఎందుకు వేయలేదు? కారణం వెల్లడించిన కిరణ్ అబ్బవరం
ఈ మధ్య కాలంలో చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా విడుదలకు ఒక రోజు ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయడం ఒక ఆనవాయితీగా మారింది. ఈ షోల ద్వారా వచ్చే పాజిటివ్ టాక్ సినిమా బాక్సాఫీస్ భవిష్యత్తును మారుస్తుందని నిర్మాతల నమ్మకం. అయితే, కిరణ్ అబ్బవరం నిర్మించిన, అంతా కొత్తవారితో కూడిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చిత్రం మాత్రం ప్రీమియర్ షోలు వేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

దీనిపై ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో కిరణ్ అబ్బవరం వివరణ ఇచ్చారు.”సెన్సార్ బోర్డు కొన్ని కట్స్ (Censor Cuts) సూచించింది. వాటిని అమలు చేయడానికి మాకు కొంత సమయం పట్టింది. ఈ ప్రక్రియలో సెన్సార్ అధికారులు మాకు ఎంతో సహకరించారు. ఒకవేళ సెన్సార్ సర్టిఫికేట్ నిన్ననే చేతికి వచ్చి ఉంటే, కచ్చితంగా ప్రీమియర్ షోలు వేసేవాళ్లం. ఆలస్యం కావడం వల్ల రేపు నేరుగా మార్నింగ్ షోలతోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది,” అని కిరణ్ వెల్లడించారు.

Also Read:మన ఓటును కాపాడుకోవాలి: SIRపై కేటీఆర్

గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ చిన్న చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి. ఇందులో సాయి తేజ్ మరియు వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటించగా, కొత్త దర్శకుడు వి. మునిరాజు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

- Advertisement -