క్షణంలో 31 సినిమాలు డౌన్‌లోడ్‌ చేసుకోండి..

217
Nokia's terabit fiber internet
Nokia's terabit fiber internet
- Advertisement -

కంప్యూటర్‌ యుగంలో ఇంటర్నెట్‌ విప్లవం ఎన్నో వినూత్న ఆవిష్కరణలకు వేదిక అవుతోంది. అత్యంత కీలక పాత్రను పోషి స్తోంది. మారుమూల గ్రామాల్లోకి సైతం చొచ్చుకుపోతోంది. ఏం చేయా లన్నా.. ఏం కొనాలన్నా.. ఏం తినాల న్నా.. అన్నిటికీ ఇంటర్నెట్‌ కీలకం గా మారింది. ఇక ప్రస్తుతం గరిష్ఠ ఇంటర్నెట్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 100జీబీపీఎస్‌గా ఉంది . అయితే ఇది అన్ని దేశాల్లో లేదు. కొన్ని అభివృద్ది చెందిన దేశాల్లో మాత్రమే ఈ వేగం ఉంది. రానున్న రోజుల్లో ఆ వేగం మరింత పెరగి 125జీబీపీఎస్‌కు చేరే వీలుందని చెబుతున్నారు పరిశోధకులు. అందుకు నోకియా సంస్థకు చెందిన బెల్‌-ల్యాబ్స్‌ సరికొత్త ఫైబర్‌ నెట్‌వర్క్‌ సాంకేతికతను అభివృద్ధి చేసింది.

internet

జర్మనీలోని టెక్నికల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ మునిచ్‌తో కలిసి నోకియా ల్యాబ్స్‌ పరిశోధకులు సృష్టించిన ఈ నెట్‌వర్క్‌ను తాజాగా డచ్‌ టెలికాం సంస్థ పరిశీలించింది. సాధారణ పరిస్థితుల్లో దీని ద్వారా సెకనుకు 125జీబీ వేగంతో డేటాను బదిలీ చేయగలిగినట్లు వెల్లడించారు. అంటే ఒక్కోటి 4జీబీ ఉండే 31 హెచ్‌డీ సినిమాలను కేవలం సెకనులోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నమాట. ఇంతకుముందున్న స్పీడ్‌ కంటే 1000 రెట్ల స్పీడ్ పెరగనుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతే కాకుండా పొడవైన ఫైబర్‌ నెట్‌వర్క్‌లోనూ ఈ సాంకేతికత పని చేస్తుందని అంటున్నారు.

స్పీడ్‌ను పెంచేందుకు నూతన మాడ్యులేషన్‌ సాంకేతికతను రూపొందించినట్లు నోకియా ప్రెసిడెంట్ మార్కస్‌ వెల్డన్‌ వెల్లడించారు. అది డాటా బదిలీ వేగాన్ని 30శాతం వరకు పెంచుతుందట. అయితే.. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్‌ ప్రయోగ దశలోనే ఉంది. ఇంటర్నెట్ ఆ వేగాన్ని అందుకుందంటే.. ఇక ప్రపంచంలో పెను మార్పులు చోటు చేసుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చని నిపుణులు అంటున్నారు.

- Advertisement -