IPL: ‘ముచ్చటైన’ క్షణం

6
- Advertisement -

ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ (MI) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం కంటే కూడా, మైదానంలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ల కలయికే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు దిగ్గజాలు ఒకే చోట కనిపించడం క్రికెట్ అభిమానుల కళ్లకు విందునిచ్చింది. ఈ ఏడాది జనవరిలో న్యూజిలాండ్‌తో సిరీస్ ముగించుకుని లండన్ వెళ్లిన కోహ్లీ, ఐపీఎల్ కోసం తిరిగి రాగా.. సచిన్ తన కుమారుడు అర్జున్ వివాహ పనుల్లో బిజీగా ఉండటంతో వీరిద్దరూ కలిసే అవకాశం రాలేదు.

వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 18 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు కరచాలనం చేసుకుంటున్న సమయంలో కోహ్లీ తన ఆరాధ్య దైవం సచిన్‌ను చూడగానే ఆగిపోయారు. ఇద్దరూ చిరునవ్వుతో పలకరించుకుని, ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న దృశ్యం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

కోహ్లీ ఎదుగుదలలో సచిన్ పాత్ర ఎంతో ఉంది. ముఖ్యంగా 2014 ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నప్పుడు, అతనికి సలహాలిచ్చి తిరిగి గాడిలో పెట్టింది సచిన్ టెండూల్కరే. అందుకే సచిన్ అంటే విరాట్‌కు ఎనలేని గౌరవం.

Also Read:వరుణ్ తేజ్..’కొరియన్ కనకరాజు’!

అయితే, విరాట్‌ను చూడగానే సచిన్ స్పందించిన తీరు మరింత ముచ్చటగా ఉంది. విరాట్‌ను ఏదో అడుగుతూ సచిన్ నవ్వగా, కోహ్లీ తల ఊపుతూ సమాధానమిచ్చారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. సచిన్ కోహ్లీ పిల్లలు (వామికా, అకాయ్) క్షేమ సమాచారాలను అడిగి ఉండవచ్చు. ఆ తర్వాత సచిన్ ఆత్మీయంగా విరాట్ భుజం తట్టి పంపడం ఈ కలయికలో హైలైట్‌గా నిలిచింది.

- Advertisement -