మొబైల్ యాప్‌లు మీ డేటాను రహస్యంగా దొంగిలిస్తున్నాయా? ఈ విషయంలో Federal Bureau of Investigation (FBI).. ఐఫోన్ మరియు ఆండ్రాయిడ్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.
ముఖ్యంగా విదేశీ సంస్థలు తయారు చేసిన మొబైల్ యాప్‌లను—ప్రత్యేకించి చైనా ఆధారిత యాప్‌లను—డౌన్‌లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. చైనాలో డిజిటల్ మౌలిక వసతులు ఉన్న యాప్‌లు అక్కడి జాతీయ భద్రతా చట్టాలకు లోబడి ఉంటాయని FBI పేర్కొంది. దీనివల్ల చైనా ప్రభుత్వం వినియోగదారుల డేటాను పొందే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఉదాహరణకు, చైనా నేషనల్ ఇంటెలిజెన్స్ చట్టంలోని ఆర్టికల్ 7 ప్రకారం…ప్రతి సంస్థ మరియు పౌరుడు చట్టానికి అనుగుణంగా జాతీయ గూఢచారి కార్యకలాపాలకు సహకరించాలి, మద్దతు ఇవ్వాలి.అలాగే ఆర్టికల్ 14 ప్రకారం: “జాతీయ గూఢచారి సంస్థలు అవసరమైన సహాయం కోసం సంస్థలు, వ్యక్తులను కోరవచ్చు.
యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, వినియోగదారులు ఇచ్చే అనుమతుల ద్వారా ఆ యాప్‌లు నిరంతరం డేటాను సేకరించగలవని FBI తెలిపింది. యాప్ ఓపెన్‌లో ఉన్నప్పుడే కాదు, మొత్తం ఫోన్‌లోని వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరించే అవకాశం ఉంటుంది.
యాప్‌లు ఏ డేటాను సేకరిస్తాయి?
కాంటాక్ట్స్ (ఇమెయిల్స్, ఫోన్ నంబర్లు)
యూజర్ ఐడీలు
అడ్రెసులు
ఫోన్‌లో సేవ్ చేసిన ఇతర వ్యక్తుల వివరాలు
కొన్ని యాప్‌లు ఫ్రెండ్స్‌ను ఆహ్వానించమని అడుగుతాయి. అలా చేస్తే, మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారి సమాచారాన్ని కూడా సేకరించవచ్చు.
కొంత డేటా చైనాలోని సర్వర్లలో నిల్వ చేయబడుతుంది
కొన్ని యాప్‌లు డేటా షేరింగ్‌కు అంగీకరించకుండా పనిచేయవు
కొన్ని యాప్‌లలో మాల్వేర్ (హానికర కోడ్) ఉండవచ్చు
ఈ మాల్వేర్ ద్వారా:
మీ ఫోన్‌లో అదనపు హానికర ఫైళ్లు ఇన్‌స్టాల్ చేయవచ్చు
మీ డేటాకు అనధికార ప్రవేశం పొందవచ్చు
సిస్టమ్‌లో “బ్యాక్‌డోర్” తెరవవచ్చు
ALso Read:కొత్త కాన్సెప్ట్‌తో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ!
డౌన్‌లోడ్ విషయంలో హెచ్చరిక
అపరిచిత వెబ్‌సైట్లు లేదా థర్డ్-పార్టీ యాప్ స్టోర్ల నుండి యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం ప్రమాదకరం. అధికారిక యాప్ స్టోర్లు (Google Play, App Store) మాల్వేర్‌ను స్కాన్ చేయడం వల్ల ప్రమాదం తక్కువగా ఉంటుంది.
మీ డేటాను ఎలా రక్షించుకోవాలి?
అవసరం లేని అనుమతులను (permissions) ఆఫ్ చేయండి
అధికారిక యాప్ స్టోర్ల నుంచే యాప్‌లు డౌన్‌లోడ్ చేయండి
యాప్ టర్మ్స్ & కండిషన్స్ చదవండి
ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను రెగ్యులర్‌గా అప్‌డేట్ చేయండి
పాస్‌వర్డ్స్‌ను తరచూ మార్చండి

