భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మరోసారి టీమ్ ఇండియా జెర్సీ ధరించి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ద్వారా సచిన్.. 2011 వరల్డ్ కప్ విజయానికి 15 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
మొదటి బంతి ఎప్పుడూ గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది… ఆ రాత్రి అయితే అది ఆగలేదు. 15 సంవత్సరాలు గడిచినా ఆ అనుభూతి ఇప్పటికీ అలాగే ఉంది. మనమందరం చిన్న క్రికెటర్లుగా ఒకే కలతో ఎదిగాం — భారతదేశం కోసం వరల్డ్ కప్ గెలవడం అని సచిన్ భావోద్వేగంతో తెలిపారు. అభిమానులకు మరియు ఆ ప్రయాణంలో భాగమైన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
2011 ఏప్రిల్ 2న జరిగిన ఫైనల్లో భారత్ విజయం సాధించడం దేశ క్రీడా చరిత్రలో ఒక మైలురాయి. ఇది 1983 తర్వాత వచ్చిన తొలి వరల్డ్ కప్ కావడం ప్రత్యేకత. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక ముందుగా బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 274/6 స్కోర్ చేసింది. జయవర్ధనే అద్భుతంగా ఆడి 103* పరుగులతో రాణించాడు.
సెహ్వాగ్ డకౌట్ కాగా గంభీర్ 97, ధోని 79 బంతుల్లో అజేయంగా 91 పరుగులు చేసి, చివర్లో సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించారు. భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది.
The first ball always makes your heart race… and that night, it never stopped.
15 years later, it still stays with us. We all grew up as a bunch of young cricketers, united by one dream. To win the World Cup for India.
To everyone who was a part of the journey, and to all the… pic.twitter.com/rW141yJraF
— Sachin Tendulkar (@sachin_rt) April 2, 2026
Also Read:బీజేపీలో చేరిన ఆప్ నేత ఫూల్కా!

