యుద్ధంపై జెలెన్‌స్కీ సంచలన ప్రకటన

2
- Advertisement -

ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్జాతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు రష్యా ఇంటలిజెన్స్ సహాయం అందిస్తోందని ఆయన ఆరోపించారు.

ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని పేర్కొంటూ జెలెన్‌స్కీ ఒక వీడియోను విడుదల చేశారు. యుద్ధ పరిస్థితుల్లో ఇలాంటి సహకారం ప్రాంతీయ భద్రతను మరింత ప్రమాదంలోకి నెట్టేస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

రష్యా వైఖరిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన జెలెన్‌స్కీ, వెంటనే ఇరాన్‌కు అందిస్తున్న సహాయాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామం అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read:వరల్డ్ వైడ్‌గా గాయపడ్డ సింహం!

ఇదిలా ఉండగా రష్యా మరియు ఇరాన్ ఇప్పటివరకు జెలెన్‌స్కీ ఆరోపణలపై అధికారికంగా స్పందించలేదు.

- Advertisement -