విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్..

5
- Advertisement -

విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వం అన్ని ఎయిర్‌లైన్స్‌కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి విమానంలో కనీసం 60% సీట్లను అదనపు చార్జీలు లేకుండా అందుబాటులో ఉంచాలని సూచించింది.

ఇప్పటి వరకు చాలా ఎయిర్‌లైన్స్ టికెట్ బుక్ చేసిన తర్వాత సీటు ఎంపిక కోసం అదనంగా డబ్బులు వసూలు చేసేవి. దీంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కొత్త నిబంధనల ప్రకారం..

ప్రతి ఫ్లైట్‌లో 60% సీట్లు ఉచితంగా (ఫ్రీగా) ఎంపిక చేసుకునేలా ఉండాలి

ఒకే PNR పై టికెట్లు బుక్ చేసిన ప్రయాణికులను కలిసి కూర్చోబెట్టాలి

ప్రయాణికుల హక్కులపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలి

లగేజీ, పెంపుడు జంతువులు వంటి అంశాలపై స్పష్టమైన పాలసీలు ఉండాలి

ఈ చర్యల ద్వారా అదనపు ఛార్జీలు తగ్గుతాయి

పారదర్శకత పెరుగుతుంది

ప్రయాణికులకు సౌకర్యం మెరుగవుతుంది

Also Read:వినూత్నంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్

“60% సీట్లు ఫ్రీ” అంటే టికెట్ మొత్తం ఉచితం కాదు. కేవలం సీటు ఎంపికపై అదనపు చార్జీలు ఉండవు. మొత్తం మీద, ఈ నిర్ణయం విమాన ప్రయాణాన్ని మరింత సులభంగా, న్యాయంగా మార్చేందుకు తీసుకున్న ముఖ్యమైన అడుగు.

- Advertisement -