ఉత్తర కొరియాలో జరిగిన తాజా పార్లమెంటరీ ఎన్నికల్లో Kim Jong Un ప్రభుత్వానికి 99.93% మద్దతు వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు. 2026 మార్చి 15న ఉత్తర కొరియాలో సుప్రీం పీపుల్స్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి.మొత్తం 687 మంది ప్రతినిధులు ఎన్నికయ్యారు.ప్రతి స్థానానికి ఒకే అభ్యర్థి మాత్రమే అనుమతించారు.
ఓటింగ్ శాతం 99.99%గా ప్రకటించారు.99.93% మంది అభ్యర్థులకు మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు.
కిమ్ అభ్యర్థిగా పోటీ చేయకపోయినా దేశానికి ప్రధాన నాయకుడిగానే కొనసాగుతున్నాడు. అయితే ఉత్తర కొరియాలో ఎన్నికలు నిజమైన ప్రజాస్వామ్య ప్రక్రియ కాదని విశ్లేషకులు చెబుతున్నారు.. ప్రజలకు నిజమైన ఎంపిక ఉండదు.పాలక పార్టీ నిర్ణయాలకే అసెంబ్లీ కేవలం ముద్ర వేస్తుంది.
Kim Jong Un ప్రస్తుతం వర్కర్స్ పార్టీ జనరల్ సెక్రటరీ.స్టేట్ అఫైర్స్ కమిషన్ అధ్యక్షుడు.సైన్యాధిపతి.అసెంబ్లీ సమావేశంలో ఆయనను అధికారికంగా దేశ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశముంది.
Also Read:వినూత్నంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్
కిమ్ సోదరి Kim Yo-jong పార్టీ కేంద్ర కమిటీలో కీలక పదవి చేపట్టనున్నారు. ఆమె భవిష్యత్ వారసురాలిగా భావిస్తున్నారు.తరువాత అధికారాన్ని కిమ్ కుమార్తె కిమ్ జూ-ఏకు అప్పగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

