కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు(82) కన్నుమూశారు. గత కొంతకాలంగా హైదరాబాద్ లోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు కావూరి సాంబశివరావు.
నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయాల్లో చురుగ్గా పనిచేశారు కావూరి. కాంగ్రెస్ హయాంలో 5సార్లు లోక్ సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. యూపీఏ-2 ప్రభుత్వంలో కేంద్ర టెక్స్ టైల్ శాఖ మంత్రిగా పని చేశారు కావూరి.
కావూరి మరణం పట్ల సంతాపం తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన మరణ వార్త నాకు ఎంతో బాధ కలిగించింది. ఆయన మరణానికి నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను అన్నారు.
2013లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతున్న సమయంలో, అప్పటి కేంద్ర వస్త్ర మంత్రిగా ఉన్న ఆయనను నేను నా నియోజకవర్గం సిరిసిల్లకు ఆహ్వానించాను. అక్కడి పవర్‌లూమ్ పరిశ్రమకు మద్దతు ప్రకటించి సహాయం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అన్నారు.
My wholehearted condolences on the passing of Former Union Minister Sri Kavuri Sambasivarao Garu
At the height of Telangana agitation in 2013, I had invited him as the Union Textile Minister to my constituency Siricilla. He not only visited but also extended his support to the… pic.twitter.com/aB5V4lXDhy
— KTR (@KTRBRS) March 11, 2026
Also Read:వార్ ఎఫెక్ట్..యూరియాపై కూడా!

