టీమిండియా జట్టు ఆలయాలకే ఎందుకు వెళ్తుంది?

3
- Advertisement -

భారత క్రికెట్ జట్టు ఆలయాలకే ఎందుకు వెళ్తుంది? మసీదు, చర్చి, గురుద్వారాలకు ఎందుకు వెళ్లదు? అనే ప్రశ్నపై మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ చేసిన వ్యాఖ్యలకు మరో మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించారు. మతాల మధ్య విభేదాలు సృష్టించడం సరైంది కాదన్నారు. ఆలయం, మసీదు, చర్చి, గురుద్వారా అన్నీ ఒకటేనని చెప్పారు.

ఈ విషయంలో రాజకీయాలు చేయడం అర్థంలేని పని… భారత జట్టు ట్రోఫీని ఆలయానికి తీసుకెళ్లినా, మసీదుకి తీసుకెళ్లినా, చర్చికి తీసుకెళ్లినా అది వారి ఇష్టం. తమ కోరిక నెరవేరిన తర్వాత దేవుడికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్లడం తప్పేముంది? అని హర్భజన్ అన్నారు.

ఇలాంటి వ్యాఖ్యలు సహ క్రికెటర్ నుంచి రావడం బాధాకరమని కూడా ఆయన తెలిపారు. దేశం ప్రపంచకప్ గెలిచింది. అందరూ ఆనందంగా జరుపుకోవాలి. కానీ ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరైంది కాదు. మా విశ్వాసంలో అన్ని మతాలు సమానమే. దేవుళ్లు వేర్వేరు కావచ్చు కానీ మార్గం ఒక్కటే అని ఆయన పేర్కొన్నారు.

Also Read:సత్యవతిగా రీతు!

భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ ట్రోఫీని ఆలయానికి తీసుకెళ్లడాన్ని విమర్శించారు కీర్తి ఆజాద్. భారత జట్టు అన్ని మతాల ప్రజలను ప్రతినిధ్యం వహిస్తుందని, అందుకే ఇతర మతాల ప్రార్థనా స్థలాలను కూడా సందర్శించాల్సిందిగా ఆయన అభిప్రాయపడ్డారు. 1983 ప్రపంచకప్ జట్టును ఉదాహరణగా చూపిస్తూ భారత క్రికెట్‌లో మత వైవిధ్యం ఎప్పటినుంచో ఉందని, వేడుకలు కూడా అదే సమగ్రతను ప్రతిబింబించాలని ఆయన అన్నారు. ఈ చర్చ ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -