ఎక్కువ సేపు ‘స్క్రీన్’ చూస్తున్నారా?

1
- Advertisement -

డిజిటల్ పరికరాల ముందు ఎక్కువ సమయం గడపడం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని కార్డియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల ఒత్తిడి, రక్తపోటు పెరగడం, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరగవచ్చని ఆయన తెలిపారు.

ప్రస్తుతం చాలా మంది పెద్దలు సోషల్ మీడియా స్క్రోలింగ్, వెబ్ సిరీస్‌లు చూడటం లేదా కార్యాలయ పనులతో కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. పిల్లలు కూడా మొబైల్ ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లు, ఆన్‌లైన్ క్లాసులు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో స్క్రీన్‌లు మన దైనందిన జీవితంలో భాగమయ్యాయి. అయితే ఈ అధిక స్క్రీన్ టైమ్ గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల బరువు పెరగడం, అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇవన్నీ గుండె జబ్బులకు ప్రధాన కారణాలుగా మారుతాయి. అలాగే నిరంతరం డిజిటల్ పరికరాల వాడకం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరిగి కార్టిసోల్ హార్మోన్ స్థాయులు పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.

Also Read:ఇంట్రెస్టింగ్‌గా విక్రమ్ ఆన్ డ్యూటీ!

రాత్రివేళల్లో స్క్రీన్ వాడకం వల్ల నిద్ర కూడా దెబ్బతింటుంది. దీంతో శరీరానికి అవసరమైన విశ్రాంతి లభించక రక్తపోటు పెరగడం, గుండె పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీర్ఘకాలంలో ఇది గుండెపోటు లేదా హృదయ స్పందనలో అసమానతలకు దారి తీసే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -