యుద్ధం మిగిల్చిన విషాదం..

2
- Advertisement -

ఇరాన్–ఇజ్రాయెల్–అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రపంచాన్ని కలవరపెడుతుండగా, ఈ ఘర్షణలు చిన్నారుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 200 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు యునిసెఫ్ వెల్లడించింది. తాజా నివేదిక ప్రకారం మొత్తం 192 మంది పిల్లలు యుద్ధంలో మృతి చెందినట్లు పేర్కొంది.

ఈ మరణాల్లో అత్యధికంగా ఇరాన్‌లోనే నమోదయ్యాయి. అక్కడ 181 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు నివేదిక తెలిపింది. అదేవిధంగా లెబనాన్‌లో ఏడుగురు పిల్లలు, ఇజ్రాయెల్‌లో ముగ్గురు చిన్నారులు, కువైట్‌లో ఒక చిన్నారి మృతి చెందినట్లు యునిసెఫ్ వెల్లడించింది. యుద్ధ ప్రాంతాల్లో జరుగుతున్న బాంబు దాడులు, క్షిపణి దాడులు, పేలుళ్లు ఈ విషాదానికి ప్రధాన కారణాలుగా పేర్కొంది.

యుద్ధంతో ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లోనూ హింసకు గురికాకూడదని, వారిని రక్షించడం అంతర్జాతీయ సమాజం బాధ్యత అని సంస్థ పేర్కొంది.

Also Read:రష్యా చమురు కొనుగోలు…భారత్‌కు మినహాయింపు

యుద్ధ ప్రభావంతో వేలాది కుటుంబాలు నిరాశ్రయులవుతున్నాయని, చిన్నారులు విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారని యునిసెఫ్ హెచ్చరించింది. తక్షణమే యుద్ధాన్ని నిలిపివేసి మానవతా సహాయాన్ని పెంచాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.

- Advertisement -