ఇటీవల మృతిచెందిన సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. డిసెంబర్ 5వ తేదీన జీడిమెట్లలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న సమయంలో గుండెపోటుతో దామోదర్ ఆకస్మికంగా మృతిచెందారు. ఈ ఘటన జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది.
ఈ నేపథ్యంలో దామోదర్ కుటుంబానికి సహాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం దామోదర్ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కేటీఆర్ తరపున బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దామోదర్ కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దామోదర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబం ఎదుర్కొంటున్న కష్ట సమయంలో పార్టీ తమ బాధ్యతగా సహాయం చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా దామోదర్ కుటుంబానికి అవసరమైన అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
Also Read;రష్యా చమురు కొనుగోలు…భారత్‌కు మినహాయింపు
జర్నలిజం రంగంలో దామోదర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ పలువురు నాయకులు, జర్నలిస్టులు ఆయనకు నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. దామోదర్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అందించిన ఈ సహాయం వారికి కొంత ఊరట కలిగించిందని స్థానిక నాయకులు తెలిపారు.

