ఆఫ్ఘాన్‌ టీ20 కెప్టెన్‌గా ఇబ్రాహీం

7
- Advertisement -

ఆఫ్ఘానిస్థాన్ ఓపెనింగ్ బ్యాటర్ ఇబ్రహీం జార్డన్‌ను టీ20 అంతర్జాతీయ జట్టు కొత్త కెప్టెన్‌గా నియమించినట్లు ఆఫ్గాన్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. అదే సమయంలో శ్రీలంకతో జరగబోయే సిరీస్ కోసం జట్లను కూడా వెల్లడించింది.

ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో ఆఫ్ఘానిస్థాన్ సూపర్ ఎయిట్స్‌కు చేరుకోలేకపోవడంతో, కెప్టెన్‌గా ఉన్న రషీద్ ఖాన్ నాయకత్వంపై బోర్డు పునఃసమీక్ష చేపట్టింది. చివరకు సిరీస్ ప్రారంభానికి వారం రోజులు మాత్రమే ఉండగా రషీద్ ఖాన్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి, ఇంతకుముందు టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న ఇబ్రాహీం జద్రాన్‌కు బాధ్యతలు అప్పగించింది.

జట్లలో మార్పులు

ఈ సిరీస్ కోసం జట్లలో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇటీవల ప్రపంచకప్ జట్టులో ఉన్న ఫరూఖీ, నబీ, ఇషాక్‌ లను ఈసారి టీ20 మరియు వన్డే జట్లలో పరిగణలోకి తీసుకోలేదు.

టీ20 జట్టులో టాప్ ఆర్డర్ వికెట్‌కీపర్ బ్యాటర్ నూర్ రెహ్మాన్, ఎడమచేతి స్పిన్ ఆల్‌రౌండర్ అష్రఫ్, ఎడమచేతి ఫాస్ట్ బౌలర్ మాలిక్‌లను ఎంపిక చేశారు. ఫరీద్ అహ్మద్ మాలిక్ వన్డే జట్టులో కూడా తిరిగి స్థానం సంపాదించాడు.

అలాగే టీ20 ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌లలో మూడింటిలో ఆడిన జియా రహ్మాన్ షరీఫీకు మొదటిసారి వన్డే జట్టులో చోటు లభించింది.

టీ20 జట్టు

ఇబ్రాహీం జద్రాన్ (కెప్టెన్), గుర్బాజ్ (వికెట్ కీపర్), నూర్ రహ్మాన్ (వికెట్ కీపర్), సెదికుల్లా అతల్, దర్విష్ రసూలీ, షాహిదుల్లా కమాల్, అజ్మతుల్లా , నబీ , షరాఫుద్దిన్ అశ్రఫ్, రషీద్ ఖాన్,నూర్ అహ్మద్, ముజీబ్ రెహ్మాన్, జియా ఉర్ రహ్మాన్ షరీఫి, ఫరీద్ అహ్మద్ మాలిక్, అబ్దుల్లా అహ్మద్‌జై.

వన్డే జట్టు

హస్మతుల్లా షాహిదీ(కెప్టెన్), రెహ్మాత్ షా (వైస్ కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), ఇబ్రాహీం జద్రాన్, సెదికుల్లా అతల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఒమర్జై, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోటి, ఏఎం ఘజన్‌ఫర్, జియా ఉర్ రహ్మాన్ షరీఫి, ఫరీద్ అహ్మద్ మాలిక్, బిలాల్ సామీ.

Also Read:రష్యా చమురు కొనుగోలు…భారత్‌కు మినహాయింపు

సిరీస్ షెడ్యూల్

టీ20 మ్యాచ్‌లు: మార్చి 13, 15, 17

వన్డే మ్యాచ్‌లు: మార్చి 20, 22, 25

- Advertisement -