ప్రపంచ స్థూలకాయం దినోత్సవం సందర్భంగా నిపుణులు చెబుతున్నది ఏమిటంటే …30 ఏళ్ల తర్వాత పొట్ట చుట్టూ కొవ్వు పెరగడం కేవలం మెటబాలిజం తగ్గిపోవడం వల్ల మాత్రమే కాదు. అసలు మార్పు కండరాల పరిమాణం, హార్మోన్లు, మైటోకాండ్రియా పనితీరు, ఒత్తిడి స్థాయి, నిద్ర అలవాట్లలో జరుగుతుంది. ముఖ్యంగా భారతీయులు సహజంగానే పొట్ట చుట్టూ కొవ్వు చేరే స్వభావం కలిగి ఉండటంతో ఇది మరింత ఆందోళనకరం.
30 ఏళ్ల తర్వాత 3–8% వరకు కండరాల మాస్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కండరాలు తగ్గితే కణాల్లో శక్తిని ఉత్పత్తి చేసే మైటోకాండ్రియా సంఖ్య తగ్గుతుంది. దాంతో విశ్రాంతి సమయంలో కాలరీలు తక్కువగా ఖర్చవుతాయి. అదే ఆహారం తీసుకున్నా శరీరంలో కొవ్వు నిల్వ అవుతుంది. మహిళల్లో హార్మోన్ మార్పులు దీనిని మరింత ప్రభావితం చేస్తాయి.
భారతీయుల్లో తక్కువ బరువున్నా అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు (విస్సరల్ ఫ్యాట్) చేరే స్వభావం ఉంది. ఓ అధ్యయనం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో పొట్ట స్థూలకాయం పెరుగుతోంది. డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదం కూడా దీనితో పెరుగుతుంది. కాబట్టి బరువు కంటే నడుము కొలత ముఖ్య సూచిక.
Also Read:TTD:15న పుష్పయాగ మహోత్సవం
నిరంతర ఒత్తిడి వల్ల కార్టిసోల్ హార్మోన్ పెరిగి పొట్ట కొవ్వు నిల్వ అవుతుంది. నిద్రలేమి ఇన్సులిన్ సెన్సిటివిటీని దెబ్బతీసి ఆకలి హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. దీని వల్ల ఎక్కువగా తినడం, కొవ్వు నిల్వ పెరగడం జరుగుతుంది.
పరిష్కారం ఏమిటి?…
సరిపడ ప్రోటీన్ తీసుకోవాలి
వారానికి కనీసం 3 సార్లు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి
మెగ్నీషియం వంటి ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవాలి
శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు తగ్గించాలి
సరైన నిద్ర, ఒత్తిడి నియంత్రణ అవసరం
పొట్ట కొవ్వు కేవలం అందం సమస్య కాదు; ఇది టైప్ 2 డయాబెటిస్, ఫ్యాటీ లివర్, గుండె జబ్బులకు దారి తీస్తుంది.

