‘ధురంధర్’ ఫేమ్ ఆయేషా ఖాన్ తాజాగా ‘వి ది ఉమెన్ ఆసియా’ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్‌తో మాట్లాడిన సందర్భంగా తనకు సోషల్ మీడియాలో ఎదురవుతున్న వేధింపుల గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిరోజూ లైంగిక వ్యాఖ్యలు, అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని ఆమె తెలిపారు.
ట్రోలింగ్ గురించి మాట్లాడుతూ ఆయేషా అన్నారు….తాను దాదాపు ప్రతి రోజూ నా శరీరంపై లైంగిక వ్యాఖ్యలు ఎదుర్కొంటున్నాను. సాధారణ టాప్ వేసుకున్నా సమస్య, స్కర్ట్ వేసుకున్నా సమస్య. ఏదైనా పోస్ట్ చేసే ముందు కూడా ఆలోచించాల్సి వస్తోంది అన్నారు.
ఇది తనపై ప్రభావం చూపుతుందా? అన్న ప్రశ్నకు ఆమె స్పందిస్తూ, “ఖచ్చితంగా అవును. నేను ఏదైనా వేసుకోవాలా లేదా పోస్ట్ చేయాలా అనే విషయంలో ఇతరులు నన్ను లైంగికంగా చూడబోతున్నారని భయపడితే, అది చాలా బాధాకరమైన పరిస్థితి. కొన్నిసార్లు ‘నాకు పట్టదు’ అనిపిస్తుంది. మరికొన్నిసార్లు కామెంట్స్ చదవాలని కూడా అనిపించదు” అని అన్నారు.
Also Read:TTD:15న పుష్పయాగ మహోత్సవం
ఇంకా ఆమె తీవ్రంగా స్పందిస్తూ, “మీరు శక్తి ఉంటే చేసేవారే… అలా చెప్పేవారు నిజంగా చేయగల సామర్థ్యం ఉంటే చేసేవారు. ఇది చాలా భయంకరం. ఇవి కేవలం కామెంట్స్ కాదు, మన చుట్టూ ఉన్న నిజమైన మనుషులే ఇలా రాస్తున్నారు అన్నారు.
ఆయేషా తన కెరీర్‌ను ‘బాల్ వీర్ రిటర్న్స్’ టీవీ షోతో ప్రారంభించారు. బిగ్ బాస్ 17 ద్వారా గుర్తింపు పొందారు. గత సంవత్సరం ‘జాట్’, ‘ధురంధర్’ (షరారత్ పాట), ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’ చిత్రాల్లో కనిపించారు. త్వరలో అక్షయ్ కుమార్‌తో కలిసి ‘భాగమ్ భాగ్ 2’లో నటించనున్నట్లు సమాచారం.

