నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. కుమ్మెర జాతర ఘటనలో మరణించిన చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్.అంబేడ్కర్ కూడలి వద్ద న్యాయం చేయాలంటూ ధర్నా చేస్తున్న గ్రామస్థుల వద్దకు వెళ్లి మద్దతు ప్రకటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
గుడిలో దర్శనం చేసుకునే అవకాశం కల్పించమని అడిగిన పాపానికి దాడి చేసి 2 నెలల పాపను చంపేశారు ….ఈ దాడి మానవత్వానికే మచ్చ.. తెలంగాణ సమాజమే తలదించుకునే సంఘటన కొమ్మెరలో జరిగింది …ఇందులో హంతకులకు అండగా నిలబడ్డ ఎవరైనా చేసేది తప్పే అన్నారు. నాగర్ కర్నూల్ పోలీస్ యంత్రాంగానికి సిగ్గుందా అసలు?,పోలీసులకు జీతాలు ఇచ్చేది రాష్ట్ర ప్రజలు.. రేవంత్ రెడ్డి కాదు, ఆయన తొత్తులు కాదుఅన్నారు.
కుమ్మెర మల్లన్న స్వామి జాతరలో దాడి జరిగిన తర్వాత వారు ఫిర్యాదు చేస్తే అది సరిగ్గా లేదని పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ తీసుకోకుండా అధికార పార్టీ నాయకులకు ఫోన్ చేసి వాళ్ళు కంప్లైంట్ చేశారు, మీరు కౌంటర్ కంప్లైంట్ చేయండని చెప్పారు ..పోలీసులు వేసుకున్న యూనిఫాంకి గౌరవం ఇవ్వకుండా, చేస్తున్న ఉద్యోగానికి న్యాయం చేయకుండా అధికార పార్టీ నేతలను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు అన్నారు.
బిడ్డకు పాలు ఇవ్వాల్సిన తల్లి ఖననం చేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ న్యాయం కోసం రోడ్డు మీద కూర్చుంది..నాగర్ కర్నూల్ అధికార యంత్రాంగం ఈరోజు ఆ బిడ్డతో పాటు రాజ్యాంగాన్ని కూడా ఖననం చేసింది ,పసిగుడ్డు మొహమైనా చూసి వదిలేయండన్నా అంటే.. దుర్మార్గుడు, మానవమృగం కాలితో తంతే పసి పాప చనిపోయింది,బాధితులు మౌనిక, గణేష్ పోయి కంప్లైంట్ తీసుకోండని పోలీసులను అడిగితే మీరు సరిగ్గా రాసి ఇవ్వలేదని అన్నాడు అంట అన్నారు.
నీకు జీతం ఇచ్చేది రేవంత్ రెడ్డి ఆయన తొత్తులు కాదు.. నువ్వు సేవ చేయాల్సింది బాధితులకు …సుమోటోగా కేసు తీసుకోవాల్సింది పోయి.. అధికార నాయకులకు ఫోన్ చేసి మీ మీద ఫిర్యాదు చేసారు మీరు కూడా ఫిర్యాదు చేయండని సిగ్గులేకుండా ప్రేరేపించావు అన్నారు.

