ఆఫ్ఘాన్‌ హెడ్‌ కోచ్‌గా రిచర్డ్ పైబస్‌

3
- Advertisement -

టీ20 వరల్డ్ కప్ తర్వాత ఆప్ఘానిస్తాన్ కోచ్ జోనాథన్ ట్రాట్ పదవీ విరమణ చేయడంతో జట్టుకు కొత్త హెడ్ కోచ్‌గా ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ పైబస్‌ను నియమించింది ఆప్ఘాన్ క్రికెట్ బోర్డు. ఈ విషయాన్ని ఏసీబీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

క్రికెట్ కెరీర్ గాయాల కారణంగా ముందుగానే ముగిసినప్పటికీ, కోచ్‌గా పైబస్ మంచి గుర్తింపు పొందాడు. 2013 నుంచి 2019 వరకు వెస్టిండీస్ జట్టుతో వివిధ హోదాల్లో పనిచేశాడు. హెడ్ కోచ్, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, హెడ్ ఆఫ్ హై పెర్ఫార్మెన్స్ వంటి బాధ్యతలు నిర్వహించాడు. 2016లో వెస్టిండీస్ పురుషుల, మహిళల, అండర్-19 జట్లు ఒకే సంవత్సరంలో ఐసీసీ వరల్డ్ కప్‌లు గెలుచుకున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇది తొలి ఘనతగా నిలిచింది.

పైబస్ 1999 నుంచి 2003 వరకు పాకిస్థాన్ హెడ్ కోచ్‌గా పనిచేసి, ఆ జట్టును 1999 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. 2012లో కూడా స్వల్ప కాలం కోచ్‌గా సేవలందించాడు. దక్షిణాఫ్రికా దేశీయ మరియు ఫ్రాంచైజీ క్రికెట్‌లో అతని ఆధ్వర్యంలో జట్లు తొమ్మిది చాంపియన్‌షిప్ టైటిళ్లు గెలుచుకున్నాయి. అతనికి రెండుసార్లు సౌతాఫ్రికా క్రికెట్ కోచ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది.

మొహమ్మద్ రిజ్వాన్, ఫాఫ్ డుప్లెసిస్, డేల్ స్టెయిన్ వంటి ఆటగాళ్లలో టాలెంట్ ను వెలికితీయడంలో  పైబస్ కీలక పాత్ర పోషించాడు.

Also Read:షూతో కీళ్ల నొప్పులు..షాకింగ్!

- Advertisement -