TGSRTC:ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

9
- Advertisement -

ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీసేవ మొబైల్ యాప్ ద్వారా టీజీఎస్‌ఆర్టీసీ బస్ టికెట్లను సులభంగా బుక్ చేసుకునే అవకాశం లభిస్తోంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ “మీ టికెట్ మొబైల్” యాప్‌ను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సరికొత్త డిజిటల్ సేవ ద్వారా సుదూర, ఇంటర్‌సిటీ బస్ ప్రయాణాలకు ముందస్తుగా టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు.

ప్రస్తుతం యాప్‌లో మొత్తం 1,710 బస్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రయాణికులు తమ గమ్యస్థానం, తేదీ, సీటు ఎంపిక చేసుకుని ఆన్లైన్ చెల్లింపు ద్వారా టికెట్‌ను వెంటనే పొందవచ్చు. ఈ టికెట్‌ను మొబైల్‌లోనే చూపించి ప్రయాణించవచ్చు. కౌంటర్ వద్ద క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా ఈ సౌకర్యం సమయం మరియు శ్రమను ఆదా చేస్తుంది.

గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రయాణించే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. డిజిటల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ప్రభుత్వ లక్ష్యంతో ఈ యాప్‌ను ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో మరిన్ని సేవలను కూడా యాప్‌లో చేర్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ కొత్త సౌకర్యంతో ఆర్టీసీ ప్రయాణం మరింత సులభం, వేగవంతం కానుంది.

Also Read:షూతో కీళ్ల నొప్పులు..షాకింగ్!

- Advertisement -