గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం అనంతవరం గ్రామంలో ఫిబ్రవరి 28 నుండి మార్చి 04వ తేదీ వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఈ సందర్భంగా ఫిబ్రవరి 24వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడుతారు. ఫిబ్రవరి 28వ తేదీన సాయంత్రం 06.00 గం.లకు భగవతారాధన, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్యంగ్రహణం, అంకురార్పణం, గరుడ అధివాసం, నివేదన, బలిహరణ, మంగళ శాసనం, తీర్థప్రసాద గోష్టి నిర్వహించారు.
బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 01వ తేదీన ఉదయం 05 గం.లకు సుప్రభాతం, పంచామృత అభిషేకం, అలంకరణ, నివేదన, అర్చన సేవలను స్వామి వారికి చేపడుతారు. ఉదయం 08 గం.లకు దేవత ఆహ్వానం, భేరిపూజ అనంతరం ఉదయం 09 గం.లకు మేషలగ్నంలో ధ్వజారోహణంను శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గం.లకు స్నపన తిరుమంజనం, సాయంత్రం 05 గం.లకు ఊంజల్ సేవ చేపడతారు. రాత్రి 07 గం.లకు అశ్వ వాహనంపై స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
మార్చి 02వ తేదీ రాత్రి 07 గం.ల నుండి 09.00 గం.ల వరకు శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. మార్చి 03వ తేదీ ఉదయం 4 గం.ల నుండు ఉదయం 9 గం.ల వరకు చక్రస్నానం, మహా పూర్ణాహుతి, రాత్రి 7 గం.లకు గరుడ సేవ, రాత్రి 09.00గం.లకు ధ్వజావరోహణం, మార్చి 04వ తేదీ సాయంత్రం 5 గం.ల నుండి 9.30 గం.ల వరకు శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన చేపడుతారు.బ్రహ్మోత్సవాల నేపథ్యంలో వాహన సేవల ముందు ఆకట్టుకునేలా సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారు.
Also Read:బెంగాల్ ఓటర్లకు ప్రధాని భావోద్వేగ లేఖ

