చైతూతో నా పెళ్లైపోయింది….

226
Samantha on his Marrage
- Advertisement -

నా ఉహాల్లో నాగచైతన్యతో పెళ్లి ఎప్పుడో జరిగిపోయిందని సమంత తెలిపింది. ట్విట్టర్‌లో ఆమె ఫాలోవర్ల సంఖ్య 4 మిలియన్లకు చేరిన సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది సమంత.

మా పెళ్లి గురించి మా కంటే ఎక్కువగా అభిమానులే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారని తెలిపింది. రంగస్థలం  ప్రాజెక్ట్‌లో భాగమవడం  అదృష్టమన్న సమంత సినిమా షూటింగ్ క్లిష్టమైన వాతావరణంలో జరుగుతుందోన్నారు. చిత్రబృందం అంతా నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటానని చెప్పింది.  సినిమా కోసం చెర్రీ చాలా కష్టపడుతున్నాడని ..  ఈ పాత్రలో చెర్రీని మీరు త్వరలోనే చూడాలని ఆశిస్తున్నానని తెలిపింది.

పెళ్లైన తర్వాత కూడా ‘ప్రత్యూష’ ఫౌండేషన్‌ని నడిపిస్తానని చెప్పింది సామ్. అంతేగాదు ఎన్టీఆర్ గురించి అడిగితే జై లవకుశ అని చెప్పేసింది.
రాజుగారి గది 2లో నా పాత్ర చాలా చిన్నదని…. అయినా అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. పెళ్లయ్యాక చైతన్యతో కలిసి తప్పకుండా సినిమా చేస్తానని వెల్లడించింది.

- Advertisement -