రైతు బడి అగ్రి షోలో మాజీ మంత్రి హరీష్

5
- Advertisement -

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన రైతు బడి అగ్రి షో కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. దక్షిణ భారత దేశంలోనే 30 లక్షల మంది సబ్స్క్రయిబర్స్ తో రైతులకు రకరకాల పంటల మీద అవగాహన కల్పిస్తున్న రైతుబడి రాజేందర్ రెడ్డి ..ఒకప్పుడు కరువు ప్రాంతం, సాగు నీరు కాదు కదా తాగు నీటికి కూడా ఇబ్బంది పడ్డ ప్రాంతం తెలంగాణ.కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక మిషన్ కాకతీయ ద్వారా చెరువులను తొవ్వించి, కాలువలు తొవ్వించి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కాళేశ్వరంతో కరువును పారదోలారు.ఇవ్వాళా దేశంలోనే ఎక్కువ ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దబడ్డది అన్నారు.

తీర ప్రాంతాల్లోనే పండే ఆయిల్ పామ్ ఇప్పుడు తెలంగాణలో పండుతుంది. రైతు ఆదాయం పెంచడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించింది.సిద్ధిపేటలో 12000 ఎకరాల్లో ఈ సాగు జరుగుతుంది. వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుంది.రైతులకు టెక్నాలజీ కావాలి. రైతులకు ఈరోజు లేబర్ పెద్ద ప్రాబ్లెంగా మారింది. పంజాబ్ నుంచి, ఝార్ఖండ్ నుంచి, యూపీ నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి లేబర్ వస్తే తప్ప తెలంగాణ పల్లెల్లో నాట్లు పడని పరిస్థితి.
బీహార్ నుంచి హమాలీలొస్తే కానీ మన కల్లాల్లో ధాన్యం ఎత్తే పరిస్థితి లేదు, మిల్లులల్లో దించే పరిస్థితి లేదు. ప్రపంచ దేశాల్లో అద్భుతమైన టెక్నాలజీ ఉంది. అది ఎలాగైనా మన రైతాంగాలకి అందించాలి..యంత్రాలను ఉపయోగించినప్పుడే వ్యవసాయం లాభదాయకంగా మారుతుంది అన్నారు.

రైతులకు పెద్ద ఎత్తున వ్యవసాయ పరికరాలను సబ్సిడీ మీద ఇవ్వాల్సిన అవసరం ఉంది.రెండున్నర ఏండ్లలో అసలు ఎక్కడా కూడా వ్యవసాయ యంత్రాల మీద సబ్సిడీ అనేది లేకుండా పోయింది ..రైతులకు ఒక భద్రత కావాలి, ఒక భరోసా కావాలి. ఆ భరోసాను గతంలో కల్పించింది కేసీఆర్ గారు.అమెరికాతో భారత ప్రభుత్వ ఒప్పందం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరగబోతుంది. ఆ ఒప్పందంలో సోయా, మక్కలు, పత్తి లాంటివి ఎలాంటి టాక్స్ లేకుండా దిగుమతి కానున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాదులో ఎక్కువ పండించే సొయా రైతుల పరిస్థితి ఏం కావాలి. ఈసారి మక్కలు ఎక్కువ పండిస్తున్నారు..ఆ రైతుల పరిస్థితి ఏంటి??,మన రైతు పండించిన పంట ఖర్చు కంటే తక్కువకు అమెరికా మనకు దిగుమతి చేస్తే ఇక్కడి రైతు పరిస్థితి ఏంటి??,45 లక్షల కోట్ల విలువైన మక్కజొన్న, పత్తి, సోయా అమెరికా మనకు పంపిస్తే ఈ దేశ రైతులు ఏం కావాలి ?,విదేశాల నుండి వచ్చే పామ్ క్రూడ్ ఆయిల్ పైన 25% టాక్స్ ఉండేది కానీ ఇప్పుడు ఆ టాక్స్ 16% కు తగ్గించడం వల్ల ఇక్కడ 25000/- ఉన్న పామ్ ఆయిల్ టన్ను రేట్ 21000లకు పడిపోయింది అన్నారు.

ఈ టాక్స్ ఎందుకు తగ్గిస్తున్నారు? ఈ టాక్స్ తగ్గించడం వల్ల మనకు ఏం లాభం జరుగుతుందో కేంద్రం సమాధానం చెప్పాలి.ఒక ప్రభుత్వం చెయ్యాల్సిన పనిని రాజేందర్ రెడ్డి గారు చేసినందుకు అభినందనలు.ప్రభుత్వం యాప్ పెట్టేటప్పుడు సాధ్యాసాధ్యాలను ఆలోచించాలి. పాసుబుక్కుకు 2 సంచులు యూరియా అంటే పాస్ బుక్కులు లేని రైతుల పరిస్థితి ఏంటి?..కొత్తగా భూములు కొనుకున్న వారికి పాస్ బుక్కులు రాక 8 నెలలు అయ్యింది. రైతు కోణంలో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది ..ఫిబ్రవరి 21 వచ్చినా ఇంకా రైతుబంధు రాలేదు. సకాలంలో రైతు బంధు వేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా అన్నారు.

- Advertisement -