అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పు

7
- Advertisement -

అమెరికా సుప్రీంకోర్టు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌లపై సంచలన తీర్పు వెలువరించింది. విదేశీ దేశాలపై అధిక సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి ఎలా ఉంటుందనే ప్రశ్నను కోర్టు ముందుకు తెచ్చింది. రాజ్యాంగం ప్రకారం సుంకాలు విధించే అధికారాన్ని ప్రధానంగా కాంగ్రెస్‌కే అప్పగించిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ట్రంప్ తన పదవీకాలంలో చైనా సహా పలు దేశాలపై వాణిజ్య లోటు తగ్గించేందుకు భారీ టారిఫ్‌లు విధించారు. అయితే ఈ నిర్ణయాలు చట్టబద్ధతపై పలు వ్యాపార సంస్థలు, దిగుమతి దారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారణ అనంతరం సుప్రీంకోర్టు, అధ్యక్షుడు స్వతంత్రంగా విస్తృత సుంకాలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది.

అంతేకాదు, ఇప్పటివరకు ఇతర దేశాల నుంచి వసూలు చేసిన అదనపు సుంకాలను తిరిగి చెల్లించాలని ట్రంప్ పరిపాలనకు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో అమెరికా వాణిజ్య విధానాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. అంతర్జాతీయ వాణిజ్య రంగంపై కూడా దీని ప్రభావం పడనుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:OTT:ఓటీటీలో ఈషా..క్రైమ్ థ్రిల్లర్!

- Advertisement -