తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం గాయపడ్డ సింహం. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ మంచి స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా అప్డేట్ ప్రకారం ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఓవర్సీస్ పంపిణీ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ డీల్ విలువ సుమారు రూ. 6 కోట్లు అని సమాచారం. ఈ ఒప్పందంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశీ మార్కెట్లలో కూడా మంచి సంఖ్యలో థియేటర్లు, షోలు దక్కే అవకాశం ఉంది.
ఈ చిత్రాన్ని సప్తస్వా మీడియా వర్క్స్, పీవోవీ స్టోరీస్ మరియు జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంతినా, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేశ్ బన్సల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పవన్ సాదినేని సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్నారు.
Also Read:TG:26 నుంచి అసెంబ్లీ సమావేశాలు

