BRS మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఇవాళ దుర్మార్గంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని దౌర్జన్యంగా కైవసం చేసుకోవాలన్న కుట్రలో భాగంగానే ఈ అక్రమ అరెస్టుకు తెరలేపారు అన్నారు.
BRS స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ సీఎం రేవంత్, మంత్రి వివేక్ కలిసి ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఇవాళ క్యాతన్‌పల్లి ప్రజలు సంపూర్ణ బంద్ పాటించి నిరసన తెలిపినా ఈ ప్రభుత్వానికి బుద్దిరాలేదు అన్నారు.
అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారులు కూడా తమ వైఖరి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. బాల్క సుమన్‌ను వెంటనే విడుదల చేయాలని… ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ BRS అధికారంలోకి వచ్చాక, కాంగ్రెస్ చేస్తున్న ఈ దుర్మార్గాలన్నింటికి వడ్డీతోసహా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు గుర్తుపెట్టుకుంటే మంచిది అన్నారు.
Also Read:ఎన్టీఆర్-నీల్..ఆసక్తికర టైటిల్!

