ఆసీస్ జట్టుపై విమర్శనాస్త్రాలు!

3
- Advertisement -

ఐసీసీ వరల్డ్ కప్‌ 2026(ICC Men’s T20 World Cup 2026)లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.ఎవరూ ఊహించని విధంగా గ్రూప్ దశలోనే ఆస్ట్రేలియా నిష్క్రమించడంతో Iceland national cricket team సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు సంధించింది. జింబాబ్వే, శ్రీలంక చేతిలో పరాజయాల తర్వాత ఆస్ట్రేలియా టోర్నీ నుంచి బయటపడింది.

ప్రత్యేకంగా స్టీవ్ స్మిత్‌ను ఆలస్యంగా జట్టులోకి పిలిచి కీలక మ్యాచ్‌లో ఆడించకపోవడాన్ని ఐస్‌లాండ్ క్రికెట్ ఎద్దేవా చేసింది. “స్టీవ్ స్మిత్‌కు ఈ టోర్నీలో ఉత్తమ అనుభవం ఎయిర్‌పోర్ట్ డ్యూటీ ఫ్రీ మాత్రమే” అంటూ, ఆయనకు విగ్రహం కట్టించి జీవితకాలం ఉచిత కాడ్ చేపలు ఇస్తామని సరదాగా ట్వీట్ చేసింది. ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

ఇదిలా ఉంటే, ఇటలీ జట్టు నేపాల్‌పై తొలి విజయం సాధించగా, ఐసీసీ “ఎక్స్టసీ ఇన్ ది ఇటలీ క్యాంప్” అంటూ ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన ఐస్‌లాండ్ క్రికెట్, “ఐసీసీ యాంటీ డ్రగ్స్ వైఖరి ఎక్కడికి పోయింది? ఇటలీ జట్టు ఎక్స్టసీ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారా?” అంటూ చమత్కరించింది. ఐస్‌లాండ్ క్రికెట్ సోషల్ మీడియా వ్యంగ్య శైలి మరోసారి అభిమానులను అలరించింది.

Also Read:డీసెంట్ కలెక్షన్స్‌తో ‘నిలవే’!

 

- Advertisement -