ICC Men’s T20 World Cupలో గ్రూప్ Cలో జింబాబ్వే చేతిలో పరాజయం పాలైన ఆస్ట్రేలియా సూపర్ 8కు అర్హత సాధించలేకపోయింది. 2009 తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా గ్రూప్ దశలోనే నిష్క్రమించడం గమనార్హం. 2021లో టైటిల్ గెలిచిన జట్టు ఐదేళ్లలో టీ20ల్లో పేలవ ప్రదర్శనతో క్రికట్ అభిమానులను నిరాశపర్చింది.
2021లో దుబాయ్‌లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా, ఆ తర్వాత అదే స్థాయిని కొనసాగించలేకపోయింది. 2022లో స్వదేశంలో టైటిల్ కాపాడుకోలేకపోయింది. 2024లో సూపర్ 8 దశ దాటలేకపోయింది. 2026లో అయితే గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.
గాయాలతో ఉన్న కమిన్స్, హాజల్‌వుడ్లను జట్టులో ఎంపిక చేయడం విమర్శలకు దారితీసింది. హాజిల్‌వుడ్‌కు ప్రత్యామ్నాయం కూడా ప్రకటించలేదు. తరువాత స్టీవ్ స్మిత్‌ను జట్టులో చేర్చినా, శ్రీలంకపై మ్యాచ్‌లో బెంచ్‌పై ఉంచడం ఆశ్చర్యం కలిగించింది. 104/0 నుంచి 181/10కి కూలిపోవడం జట్టు బలహీనతను చూపించింది.
Also Read:డీసెంట్ కలెక్షన్స్‌తో ‘నిలవే’!
2022 జనవరి నుంచి ఆస్ట్రేలియా కేవలం 72 టీ20లు మాత్రమే ఆడింది – పూర్తి సభ్య దేశాల్లో అతి తక్కువ. ప్రధాన ఆటగాళ్లు కలిసి ఎక్కువగా ఆడకపోవడం సమన్వయంపై ప్రభావం చూపింది.టెస్టులు, వన్డేల్లో ఆధిపత్యం చూపినట్లు టీ20ల్లోనూ పునరాగమనం చేయాలంటే ప్రణాళిక మారాల్సిందే.

