కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం..అప్‌డేట్!

9
- Advertisement -

ఇటీవల వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న కళ్యాణ్ రామ్‌కు ఒక మంచి కంబ్యాక్ అవసరం ఉంది. ప్రస్తుతం ఆయన ఓ అన్‌టైటిల్‌డ్ యాక్షన్ డ్రామా చిత్రంలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఆయన మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు శ్రీకాంత్ విస్సాతో కలిసి ఈ సినిమా రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ లాక్ అయ్యిందని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలిసింది.

రిపోర్టుల ప్రకారం, ఈ సినిమా షూటింగ్ 2026లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అదే సంవత్సరం చివర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారని సమాచారం.

Also Read:12 ఏళ్ల టీ20 రికార్డు బ్రేక్!

శ్రీకాంత్ విస్సా ప్రముఖ రచయితగా గుర్తింపు పొందారు. ఆయన ‘పుష్ప’, ‘వెంకీ మామ’, ‘ఖిలాడీ’ వంటి చిత్రాలకు రచయితగా పని చేశారు. కళ్యాణ్ రామ్ కోసం ఆయన ఎలాంటి కథ సిద్ధం చేశారో చూడాలి.

- Advertisement -