న్యూఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో భారత్ 93 పరుగుల తేడాతో నమీబియాను ఓడించింది. భారత్ 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది. ఈ క్రమంలో 12 ఏళ్ల టీ20 వరల్డ్‌కప్ రికార్డును బద్దలు కొట్టింది.
ఓపెనర్లు ఇషాన్ కిషన్ మరియు సంజు సామ్సన్ ధాటిగా ఆడుతూ జట్టుకు అద్భుత ఆరంభం అందించారు. సామ్సన్ 8 బంతుల్లో 22 పరుగులు చేయగా, కిషన్ 24 బంతుల్లో 61 పరుగులు సాధించాడు. వీరి భాగస్వామ్యంతో భారత్ కేవలం 6.5 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇది వేగవంతమైన జట్టు శతకం.
గతంలో 2014లో ఐర్లాండ్‌పై 7 ఓవర్లలో 100 పరుగులు చేయడం. భారత్ ఆ రికార్డును ఒక బంతి ముందుగానే అధిగమించింది.మ్యాచ్ అనంతరం కిషన్ మాట్లాడుతూ, పవర్‌ప్లే ఓవర్లలో గరిష్ట ప్రయోజనం పొందడమే తమ ప్రణాళిక అని చెప్పారు. నమీబియా బౌలర్ రుబిన్ తొలి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ, తర్వాత పరిస్థితులను ఉపయోగించుకుని అదనపు పరుగులు సాధించామని వెల్లడించారు.
Also Read:‘ది ప్యారడైజ్’..రిలీజ్ డేట్ ఫిక్స్

