Peddi:జగపతికి బర్త్ డే విషెస్

5
- Advertisement -

రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ఫస్ట్ సింగిల్ సినిమాపై హైప్‌ను మరింత పెంచాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆయన ‘అప్పలసూరి’ అనే పాత్రను పోషిస్తున్నారు. కొన్ని వారాల క్రితం విడుదలైన ఆయన లుక్ పోస్టర్‌లో పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

ఇవాళ జగపతిబాబు పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సినిమాలో ఆయన నటన ప్రధాన హైలైట్‌లలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొంది. అలాగే సెట్స్‌పై కీలక సన్నివేశాన్ని బుచ్చిబాబు జగపతిబాబుకు వివరించుతున్న ఫోటోను కూడా షేర్ చేశారు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోండగా దివ్యేండూ శర్మ, బోమన్ ఇరానీ, సత్య ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by PEDDI (@peddimovie)

Also Read:IND vs PAK:మ్యాచ్‌కి వరణుడు అడ్డంకి?

- Advertisement -